ఇంటింటా ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2021-10-20T04:52:18+05:30 IST

డెంగీ జ్వరాలను అరికట్టడానికి ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యమేనని మలేరియా ఏలూరు సబ్‌ యూనిట్‌ అధికారి జె.గోవిదంరావు అన్నారు.

ఇంటింటా ఫీవర్‌ సర్వే
డెంగీ జ్వరాలపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 19 : డెంగీ జ్వరాలను అరికట్టడానికి ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యమేనని మలేరియా ఏలూరు సబ్‌ యూనిట్‌ అధికారి జె.గోవిదంరావు అన్నారు. నగరంలో, పరిసర ప్రాంతాల్లో డెంగీ జ్వరాలు విస్తరిస్తున్న నేపథ్యంలో మంగళవారం శనివారపుపేట, వైఎస్సార్‌కాలనీ, శ్రీరామ్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో వైద్యసిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటా ఫీవర్‌ సర్వేను ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో సంభవించే అంటువ్యాధులు, ముఖ్యంగా దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా, బోధకాలు వంటి వ్యాధులపై స్థానికులకు అవగాహన కల్పించారు. కనీసం వారానికి ఒకసారి నీళ్ళ తొట్టెలను శుభ్రపరిచి మూతలు పెట్టాలని స్థానికులకు సూచించారు. సాయం త్రం కిటికీ తలుపులు మూసివేయడం, దోమ తెరలు వాడడం ద్వారా దోమకాటు నుంచి రక్షించుకోవచ్చన్నారు.ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటా అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అనం తరం డ్రైన్లలో దోమల నివారణ మందు పిచికారి, ఇళ్ళల్లో దోమల నివారణ మందు చల్లడం వంటి కార్యక్రమాలను పర్యవేక్షించారు. 


Updated Date - 2021-10-20T04:52:18+05:30 IST