డెంగ్యూ పంజా!

ABN , First Publish Date - 2021-10-24T06:03:59+05:30 IST

ఇలా రణస్థలం మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో డెంగ్యూ పంజా విసురుతోంది. జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎక్కువ మంది డెంగ్యూ బారిన పడుతుండం ఆందోళన కలిగిస్తోంది. రక్తకణాలు తగ్గుముఖం పట్టాయని తేలుతోంది. జ్వరాల బారిన పడుతున్న వారు స్థానిక ఆర్‌ఎంపీల వద్ద వైద్యసేవలు పొందుతుండగా..స్థోమత ఉన్న వారు శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. జేఆర్‌పురం పంచాయతీ పరిధిలోని యాతపేటలో

డెంగ్యూ పంజా!
ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులు




 రక్తకణాలు తగ్గడంతో ఆందోళనలో బాధితులు

రోజురోజుకూ పెరుగుతున్న జ్వరపీడితులు

పారిశుధ్యం క్షీణించడమే కారణం

పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

రణస్థలం, అక్టోబరు 23: 

- జేఆర్‌ పురం పంచాయతీ యాతపేటకు చెందిన టేకు దీపికాచారి అనే బాలిక గత మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రక్త పరీక్షలు చేయగా డెంగ్యూగా నిర్థారణ అయ్యింది. అత్యవసర వైద్యం అందించడంతో ఆమె కోలుకుంది.  

- చుక్క రాంబాబు అనే యువకుడుకి డెంగ్యూగా నిర్థారణయ్యింది. ప్లేట్‌లెట్లు పదివేలకు పడిపోయాయి. దీంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అత్యవసర వైద్యసేవలందిస్తున్నారు. రోజుకు రూ.12 వేలు ఖర్చవుతోందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

-- ఇలా రణస్థలం మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో డెంగ్యూ పంజా విసురుతోంది. జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎక్కువ మంది డెంగ్యూ బారిన పడుతుండం ఆందోళన కలిగిస్తోంది. రక్తకణాలు తగ్గుముఖం పట్టాయని తేలుతోంది. జ్వరాల బారిన పడుతున్న వారు స్థానిక ఆర్‌ఎంపీల వద్ద వైద్యసేవలు పొందుతుండగా..స్థోమత ఉన్న వారు శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. జేఆర్‌పురం పంచాయతీ పరిధిలోని  యాతపేటలో  టేకు దీపికాచారి, చుక్క రాంబాబు, వనుము దీక్షిత్‌లకు డెంగ్యూగా నిర్థారణ కావడంతో శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంకటేశ్వర కాలనీలో సరస్వతి, అప్పయ్యమ్మలకు ప్లేట్‌లెట్లు తగ్గుముఖం పట్టడంతో ఆస్పత్రిలో చేరారు. రావాడకు చెందిన అప్పయ్యమ్మ, నగరప్పాలేనికి చెందిన కనకరత్నం, కొండములగాంకు చెందిన దన్నాన లక్ష్మి, కె.అప్పలనాయుడు, సీహెచ్‌ చిన్నమ్ముడు,  సువ్వాడ రాముడు తదితరులకు డెంగ్యూగా నిర్థారణ అయినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదు. జ్వరాల తీవ్రత పెరుగుతున్నా తక్షణ సేవలు అందించడం లేదు. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వేలాది రూపాయలను వదిలించుకుంటున్నారు. 

 పారిశుధ్యం అస్తవ్యస్తం

జేఆర్‌పురం పంచాయతీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా క్షీణించింది. సక్రమంగా పనులు జరగక కాలువల్లో పూడికలు పేరుకుపోయాయి. రహదారులపై మురుగు నీరు ప్రవహిస్తోంది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు మోత మోగిస్తున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజుల తరబడి నీరు రహదారులపై నిల్వ ఉండిపోతోంది. దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో వర్షపు నీరు చేరుతోంది. ఖాళీ కొబ్బరి బొండాలు, సీసాలు ఇష్టారాజ్యంగా పడేస్తుండడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఇప్పటికైనా పంచాయతీ పాలకవర్గం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. 




Updated Date - 2021-10-24T06:03:59+05:30 IST