జ్వరం...కలవరం

ABN , First Publish Date - 2022-01-22T05:44:00+05:30 IST

ప్రతికూల వాతావరణం ప్రజ లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఉదయం 10 గంటల అయినప్పటికీ చలి తీవ్రత తగ్గడం లేదు.

జ్వరం...కలవరం

జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితుల సంఖ్య

కరోనా సోకిందేమోనని బాధితుల్లో భయాందోళన

జ్వరాలన్నీ కొవిడ్‌ కాదంటున్న వైద్యులు

జగిత్యాల, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రతికూల వాతావరణం ప్రజ లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఉదయం 10 గంటల అయినప్పటికీ చలి తీవ్రత తగ్గడం లేదు. సూర్యోదయ వేళ దాటిన మంచు తెరలు వీడడం లేదు. చాలా మంది జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. చాలా మం ది తాము కొవిడ్‌ బారిన పడ్డామేమోనని తీవ్ర ఆందోళనకు గురవుతు న్నారు. చిన్న పాటి జ్వరానికి కూడా అధిక మోతాదులో మందులు విని యోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా ఇదే సమయంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు సైతం పెరగడం మ రింత ఆందోళనకు కారణమవుతోంది. పక్షం రోజుల క్రితం జిల్లాలో పదు ల సంఖ్యలో నమోదయిన కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు ప్రస్తుత వారం రో జులుగా 125 నుంచి 175 వరకు నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో సాధారణ జ్వరం వచ్చినా కొవిడ్‌ అనే భయం చోటుచేసుకుంటోంది.

ఆసుపత్రుల్లో పెరుగుతున్న ఓపీ...

జిల్లాలో ప్రతీ పీహెచ్‌సీలో రోజుకు సగటున 50 నుంచి 60 ఓపీ న మోదవుతోంది. సీహెచ్‌సీలలో సుమారు 200కు పైగా ఉంటుంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ప్రతీ రోజు 500 నుంచి 700 వరకు వైద్యులు ఓపీ చూస్తున్నారు. ప్రతీ ప్రైవేటు ఆసుపత్రి వద్ద రోజుకు 50 నుంచి 100 వరకు ఓపీ ఉంటుంది. వారం వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా సగటున ప్రతీ రోజు సుమారు 5వేల మంది వరకు జ్వర పీడితులు ఆ సుపత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు అంచనాలున్నాయి. వీరిలో సగాని కి పైగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటుండగా కేవలం 5 నుంచి 10 శా తం లోపు మాత్రమే కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. అ యినప్పటికీ ప్రజల్లో కొవిడ్‌ ఆందోళన అధికమై అత్యధికంగా మందులు వినియోగిస్తున్నారు. జిల్లాలో ఈ నెల 18వ తేదీన 2,120 మంది కొవిడ్‌ టెస్టులు చేయించుకోగా 114 మందికి పాజిటివ్‌గా తేలింది. అదే విధంగా 19వ తేదీన 2,430 మంది పరీక్షలు చేయించుకోగా 151 మందికి పాజిటివ్‌, 20వ తేదీన 2,250 మంది పరీక్షలు చేయించుకోగా 173 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు.

ప్రారంభమైన ఫీవర్‌ సర్వే...

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో ఇంటింటి ఫీవర్‌ సర్వేను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించారు. జిల్లాలో గత యేడాది జరిపిన ఫీవర్‌ సర్వేలో సుమారు 7,500 వరకు జ్వర పీడితులున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో అయిదు రోజుల పాటు సుమారు 2.60 లక్షల కుటుంబాలకు సర్వే చేస్తున్నారు. జిల్లాలో 652 బృందాల ద్వారా ఫీవర్‌ సర్వే జరుగుతోంది. పట్టణాల్లో అవసరమైన ప్రాంతాల్లో బృందాల సంఖ్య వేగవంతంగా సర్వే చేపడుతున్నారు. ఫీవర్‌ సర్వేలో గుర్తించిన వ్యక్తులకు అక్కడికక్కడే కిట్లు అందజేసి సలహాలు, సూచనలు ఇస్తున్నా రు. కిట్‌లో జ్వరంతో పాటు కొవిడ్‌ నివారణకు అవసరమైన మందులు అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. 

కారణాలు ఇవే..

ప్రస్తుతం రోజు పొగ మంచు అధికంగా ఉంటోంది. దీంతో పాటు చ లిగాలులు వీస్తున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు ఈ సమయం లో ప్రయాణాలు సాగిస్తున్నారు. తొలుత జలుబు, తరువాత ఒళ్లంతా నొప్పులుగా మారుతోంది. సరైన విశ్రాంతి తీసుకోకపోవడంతో జ్వరాలుగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో విష జ్వరాలుగా మారి ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నాయి. ఇలా జ్వరం బారిన పడిన వ్యక్తులు సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొవిడ్‌ బారిన పడుతున్న ట్లు వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మూడు రోజులకు మించి జ్వరం ఉంటే ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. కొవిడ్‌ పరీక్ష చేయించుకోవంతో పాటు హోమ్‌ ఐసోలేషన్‌లో జాగ్రత్తలు పాటించాలంటున్నారు. 

హోం ఐసోలేషన్‌ వైపు మొగ్గు...

కొవిడ్‌ మూడో దశ కేసుల్లో ఎక్కువ శాతం మంది హోం ఐసోలేషన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో వారం రోజులుగా కొవిడ్‌ పాజిటి వ్‌ కేసులు ఎక్కువవుతున్నాయి. దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్థులు, పదేళ్ల లోపు పిల్లలకు హోం ఐసోలేషన్‌కు వైద్యులు అనుమతి ఇవ్వడం లేదు. జిల్లా లో ప్రస్తుతం 636 పాజిటివ్‌ కేసులున్నాయి. ఇందులో కేవలం ఆరుగురు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. సాదారణ జ్వర పీడితు లు సైతం ఇళ్లలోనే ఉంటూ చికిత్సను తీసుకుంటున్నారు.

అప్రమత్తమైన అధికారులు...

జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణ జ్వరాలు, కొవి డ్‌ను నియంత్రించడానికి ప్రత్యేక సర్వేను చేస్తున్నారు. జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేస్తున్నారు. 25 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రిలో ఓపీ సేవలను పెంచారు. జిల్లాలోని జెఎన్‌టీయూ కళాశాల నందు 100 పురుషులు, 100 మహిళల వార్డుల తో మొత్తం 200 బెడ్లతో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. జిల్లాలో వంద శాతం తొలి డోస్‌ వ్యాక్సినేషన్‌, 77 శాతం సెకండ్‌ డోస్‌ వ్యాక్సినే షన్‌ను పూర్తి చేశారు. వృద్ధులకు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌ డో స్‌, 15 నుంచి 17 సంవత్సరాల్లోపు టీనేజర్లకు మొదటి డోస్‌ వ్యాక్సినేష న్‌ను అందిస్తున్నారు.

అపోహలు వీడాలి

- పుప్పాల శ్రీధర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

కొవిడ్‌ విషయంలో అపోహలు వీడాలి. కొవిడ్‌ లక్షణాలున్నట్లు నిర్ధార ణ జరిగితే హోమ్‌ ఐసోలేషన్‌లో 7 నుంచి 10 రోజుల పాటు ఉండాలి. ఈ సీజన్‌లో జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధులు సాధారణమే. పోష క విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కరోనాను ఎదుర్కొనేందు కు అవసరమైన వసతులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పించాము. ఆక్సి జన్‌ ప్లాంట్‌ సిద్ధం చేశాము. జేఎన్‌టీయూలో 200 పడకలతో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశాము.


Updated Date - 2022-01-22T05:44:00+05:30 IST