Fetuses found in garbage can: చెత్త కుండీలో 17 పిండాలు లభ్యం

ABN , First Publish Date - 2022-08-17T18:37:35+05:30 IST

డంపింగ్ యార్డులో 17 పిండాలు లభించిన ఘటన...

Fetuses found in garbage can: చెత్త కుండీలో 17 పిండాలు లభ్యం

 విచారణకు సర్కారు ఆదేశం

హౌరా( పశ్చిమబెంగాల్): డంపింగ్ యార్డులో 17 పిండాలు లభించిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరా నగరంలో వెలుగుచూసింది. హౌరాలోని ఉలుబెరియాలో 17 పిండాలు పడవేయడంపై సర్కారు విచారణకు ఆదేశించింది.పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని ఉలుబెరియా పట్టణంలో మంగళవారం 17 పిండాలను అధికారులు గుర్తించారు. పిండాలు పడవేయడంపై ఉలుబెరియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.మునిసిపాలిటీలో మంగళవారం చెత్త కుండీలో నుంచి  17 పిండాలను వెలికితీసినప్పుడు స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు.


ఈ పిండాల్లో అత్యధిక భాగం ఆడ శిశువులవని గుర్తించారు.ఉలుబెరియా పట్టణ ప్రాంతానికి ఒకటిన్నర కిలోమీటర్ల పరిధిలో 30 ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయి. ఈ పిండాలను నర్సింగ్‌హోమ్‌ల వైద్య వ్యర్థాలుగా ఇక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-08-17T18:37:35+05:30 IST