ఆరు నెలల గర్భవతి.. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో శిశువు గురించి షాకింగ్ నిజాలు.. అబార్షన్ రెడీ అయిన మహిళ.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-26T05:47:08+05:30 IST

చండీగఢ్‌లో ఒక మహిళ గర్భంలో ఉన్న 24 వారాల పిండం తీవ్రమైన మెదడు వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ గర్భాన్ని తొలగించుకోవడం కోసం ఆ తల్లి పంజాబ్-హర్యానా..

ఆరు నెలల గర్భవతి.. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో శిశువు గురించి షాకింగ్ నిజాలు.. అబార్షన్ రెడీ అయిన మహిళ.. అసలేం జరిగిందంటే..

చండీగఢ్‌లో ఒక మహిళ గర్భంలో ఉన్న 24 వారాల పిండం తీవ్రమైన మెదడు వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ గర్భాన్ని తొలగించుకోవడం కోసం ఆ తల్లి పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ వికల్ బెహ్ల్ వైద్యాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి పిండం స్థితిని పరీక్షించాలని ఆదేశించారు. చండీగఢ్ పీజీఐ తన నివేదికను మంగళవారం హైకోర్టులో సమర్పించనుంది.


హైకోర్టులో ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ ప్రకారం.. ఆమె గర్భవతి. అక్టోబర్ 12న అల్ట్రాసౌండ్ చేయించుకోగా.. కడుపులో పెరిగే పిండం గార్డెడ్ న్యూరోలాజికల్ వంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందని తెలిసింది. బిడ్డ జన్మించిన తరువాత సాధారణ జీవితం గడపలేడు. బతికే అవకాశాలు కూడా తక్కువ. ఈ సందర్భంలో పిండం గర్భస్రావం చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. దాంతో గర్భస్రావం చేయించుకునేందుకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలతో పీజీఐ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఆ మహిళను విచారించనుంది. విచారణ అనంతరం పీజీఐ మెడికల్ బోర్డ్‌ విచారణ జరిపి, మంగళవారం తన నివేదికను హైకోర్టుకు సమర్పించనుంది. నివేదికను చూసిన తర్వాత తదుపరి చర్యలకు కోర్టు ఉపక్రమిస్తుంది.


భారతదేశంలో అబార్షన్‌కు సంబంధించిన చట్టం ప్రకారం, భారతదేశంలో అబార్షన్ చట్టబద్ధమైనది. ఇది మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971 ద్వారా అనుమతించడం జరిగింది. అయితే, ఇప్పటివరకు గర్భం ధరించిన 20 వారాలలోపు గర్భస్రావం చేసుకునే వీలును చట్టం కల్పించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ సెక్షన్ 3(2) ప్రకారం, కింది పరిస్థితుల్లో గర్భం దాల్చిన తర్వాత నిర్దిష్ట కాలానికి గర్భం తొలగించుకోవచ్చు. గర్భం దాల్చడం వల్ల గర్భిణీ స్త్రీకి ప్రాణహాని ఉన్నట్లయితే లేదా ఆమె శారీరక లేదా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటే గర్భస్రావం చేయవచ్చును.  మైనర్లు లేదా మానసిక వికలాంగుల గర్భధారణ విషయంలో, గర్భస్రావం కోసం తల్లిదండ్రుల రాతపూర్వక సమ్మతి ఇస్తే గర్భస్రావం చేయవచ్చును. ఒకవేళ అత్యాచారం కారణంగా గర్భందాల్చిన సమయంలో కూడా గర్భస్రావానికి కోర్టు అనుమతి లభిస్తుంది.

Updated Date - 2021-10-26T05:47:08+05:30 IST