ఈ-కామర్స్‌కు పండగ కళ

ABN , First Publish Date - 2022-09-26T08:33:58+05:30 IST

ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు.. ఫెస్టివ్‌ సేల్స్‌ ఆఫర్లతో మంచి జోరుమీదున్నాయి. గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌లో తొలి రెండు రోజుల్లోనే ఆర్డర్లలో 28 శాతం వృద్ధి నమోదైంది.

ఈ-కామర్స్‌కు పండగ కళ

ఫెస్టివ్‌ సేల్స్‌లో తొలి రెండు రోజుల్లోనే అమ్మకాల్లో 28ు వృద్ధి

న్యూఢిల్లీ : ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు.. ఫెస్టివ్‌ సేల్స్‌ ఆఫర్లతో మంచి జోరుమీదున్నాయి. గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌లో తొలి రెండు రోజుల్లోనే ఆర్డర్లలో 28 శాతం వృద్ధి నమోదైంది. ఈ-కామర్స్‌ వేదికల్లో ఆర్డర్ల విషయంలో చోటు చేసుకుంటున్న మార్పులపై సాస్‌ కంపెనీ యూనికామర్స్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆ వివరాలు.. పర్సనల్‌ కేర్‌ విభాగం ఆర్డర్లలో 70 శాతం వృద్ధిని నమోదు చేసింది ఎలక్ర్టానిక్స్‌ విభాగం (మొబైల్‌ ఫోన్లు మినహా) 48 శాతం వృద్ధి సాధించింది. ఆడియో ఉత్పత్తులు, స్మార్ట్‌ వేరబుల్‌ ఉత్పత్తులకు ఆర్డర్లు అధికంగా ఉన్నాయి ఫ్యాషన్‌ విభాగం కూడా ఎప్పటి లాగానే  ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అలాగే గృహాలంకరణ వస్తువులు, ఫర్నీచర్‌, ఆభరణాల విభాగాలు కూడా మంచి వృద్ధిని నమోదు చేశాయి

ప్రాంతాలవారీగా ఆర్డర్ల పెరుగుదల తృతీయ శ్రేణి పట్టణాల్లో 32%, ద్వితీయ శ్రేణి నగరాల్లో 20% ఉంది.


తొలిరోజే రూ.1000 కోట్ల అమ్మకాలు

మొబైల్‌ ఫోన్ల దిగ్గజం సామ్‌సంగ్‌ అయితే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వేదికలుగా తొలిరోజే రూ.1000 కోట్ల విలువ గల 12 లక్షలకు పైగా గెలాక్సీ ఫోన్లు విక్రయించింది. పండగ సీజన్‌ను పురస్కరించుకుని కంపెనీ స్మార్ట్‌ఫోన్ల ధరల్లో 17 నుంచి 60 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తొలిరోజు తమ మార్కెట్‌ వాటా రెట్టింపయిందని సామ్‌సంగ్‌ తెలిపింది. 

Updated Date - 2022-09-26T08:33:58+05:30 IST