పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

ABN , First Publish Date - 2022-07-08T04:38:39+05:30 IST

రాబోయే బక్రీద్‌, బో నాల పండుగలను కులమతాలకతీతంగా ప్రశాం త వాతావరణంలో జరుపుకుంటూ పోలీస్‌ వారికి సహకరించాలని ఇన్‌చార్జి ఎస్పీ రంజన్‌ రతన్‌కు మార్‌ వివిధ మత పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు సూచించారు.

పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

- ఇన్‌చార్జి ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ 

- బక్రీద్‌, బోనాల పండుగలపై శాంతి సమావేశం 

  

వనపర్తి క్రైమ్‌, జూలై 7: రాబోయే బక్రీద్‌, బో నాల పండుగలను కులమతాలకతీతంగా ప్రశాం త వాతావరణంలో జరుపుకుంటూ పోలీస్‌ వారికి సహకరించాలని ఇన్‌చార్జి ఎస్పీ రంజన్‌ రతన్‌కు మార్‌ వివిధ మత పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు సూచించారు. గురువారం వనపర్తి జి ల్లా పోలీస్‌ కార్యాలయంలోని సమావేశ భవనం లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రాబోయే బక్రీద్‌, బో నాల పండుగలను ప్రజలందరూ ప్రశాంతంగా జ రుపుకునేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగం గా హిందూ, ముస్లిం మత పెద్దలతో, ప్రజాప్రతి నిధులతో జిల్లాస్థాయి శాంతి సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనాదిగా పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా సహకరించాలని, సంప్రదాయాన్ని అలాగే కొనసాగించాలని ప్రతీ ఒక్కరు తమ మతంతో పాటు, ఇతర మతాలను గౌరవించాలని అన్నారు. సోషల్‌మీడియాలో వచ్చే పుకార్లను ఎవ రూ నమ్మవద్దని, వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. పశుసంవర్థక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటు పశువుల అక్రమ రవాణా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాల సరిహద్దు లు, జిల్లా కేంద్రాలలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోక్‌ నాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే పండుగలను ప్రశాంతంగా జరుపుకునేందుకు పోలీస్‌ శాఖ పరంగా చేయాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మహేశ్వర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసాచారి, వన పర్తి, కొత్తకోట, ఆత్మకూర్‌ సీఐలు ప్రవీణ్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, రత్నం, వనపర్తి పట్టణ ఎస్సై యు గంధర్‌రెడ్డి, రూరల్‌ ఎస్సైలు, జిల్లాలోని మత పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు.  



Updated Date - 2022-07-08T04:38:39+05:30 IST