సరదాల సంక్రాంతి!

ABN , First Publish Date - 2021-01-14T06:50:47+05:30 IST

పిల్లలూ.... మనందరికి ఎంతో ఇష్టమైన పండుగ సంక్రాంతి రానే వచ్చింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన మొదటి రోజును సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

సరదాల సంక్రాంతి!

పిల్లలూ.... మనందరికి ఎంతో ఇష్టమైన పండుగ సంక్రాంతి రానే వచ్చింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన మొదటి రోజును సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి మూడు రోజుల పండుగ. భోగినాడు ఇళ్ల ముందు భోగి మంట వేస్తారు, రెండో రోజు సంక్రాంతి, కనుమ రోజున పశువులను కడిగి, బొట్టు పెట్టి పూజిస్తారు.


తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లోనూ సంక్రాంతిని ఘనంగా జరుపుకొంటారు. పంజాబ్‌లో ‘లోహ్రి’, గుజరాత్‌లో ‘ఉత్తరాయణ్‌’, ఒడిశాలో ‘మకర చౌలా’ ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌లో ‘కిచిడీ పర్వ్‌’... ఇలా సంక్రాంతిని అనేక పేర్లతో పిలుస్తారు. 


ఈ సంక్రాంతి మధుర జ్ఞాపకంగా మలచుకునేందుకు ఏం చేస్తారంటే... పండుగ రోజున ఇంటి ముందు ముగ్గులు, వాటికి రంగులు వేయడంలో అక్కాచెళ్లెల్లకు సాయపడండి. సన్నాయి ఊదుతూ చక్కగా అలంకరించిన గంగిరెద్దును తీసుకొచ్చిన గంగిరెద్దువాళ్లకు జోలెలో బియ్యం లేదా డబ్బులు వేయండి.


స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేయడంలో పోటీపడుతూ సరదాగా గడపండి సాయంత్రం ఇంటి వద్ద అమ్మకు పిండివంటల తయారీలో సాయం చేయండి. తినుబండారాలను బంధువులతో పంచుకొని పండుగను సంతోషంగా జరుపుకోండి. 

Updated Date - 2021-01-14T06:50:47+05:30 IST