ఈ వేడుక గురించి తెలుసా!

ABN , First Publish Date - 2021-11-06T05:30:00+05:30 IST

దీపావళి రోజున టపాసులు, తారాజువ్వలు కాల్చి పండుగ ఆనందంగా జరుపుకొన్నారు కదా! ఇలాగే రాకెట్‌ ఫెస్టివల్‌ పేరుతో..

ఈ వేడుక గురించి తెలుసా!

దీపావళి రోజున టపాసులు, తారాజువ్వలు కాల్చి పండుగ ఆనందంగా జరుపుకొన్నారు కదా! ఇలాగే రాకెట్‌ ఫెస్టివల్‌ పేరుతో థాయ్‌లాండ్‌ ప్రజలు పండుగ జరుపుకొంటారు. వాళ్లు ఆ పండుగ ఎప్పుడు, ఎందుకు జరుపుకొంటారో తెలుసా?


  1.  నరకాసురుని పీడ వదలడంతో ప్రజలందరూ టపాసులు కాల్చి పండుగ జరుపుకొన్నారు. అదే దీపావళి. చీకటిని పారదోలి వెలుగును తీసుకొచ్చే పండుగ ఇప్పటికీ జరుపుకొంటున్నాం. 
  2.  థాయ్‌లాండ్‌ ప్రజలు మాత్రం వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ రాకెట్లు కాల్చి వేడుక  జరుపుకొంటారు.
  3.  ఈ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. వేడుకల చివరిరోజున రాకెట్లు కాలుస్తారు.
  4.  మనం తారాజువ్వలు కొని తెచ్చుకుంటాం కానీ వాళ్లు స్వయంగా తయారుచేసుకుంటారు. వెదురు కర్రలతో రాకెట్లు తయారుచేసి 
  5. కాలుస్తారు. పోటీలు కూడా నిర్వహిస్తారు. విజేతలకు బహుమతులు అందిస్తారు.

Updated Date - 2021-11-06T05:30:00+05:30 IST