పండుగ సందడి

ABN , First Publish Date - 2022-07-01T06:35:04+05:30 IST

ఇస్రో విజయాశ్వంగా పేరుపడ్డ పీఎ్‌సఎల్వీ మరోసారి రోదసిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలోని రెండవ ప్రయోగవేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు జరిగిన ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ఈసారి సందర్శకులను అనుమతించడంతో షార్‌ ఆవరణం చాలాకాలం తర్వాత సందడిగా మారింది.రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు పలు ప్రాంతాలనుంచి మీడియా సిబ్బందితో పాటు ప్రజలు పెద్దఎత్తున షార్‌కు చేరుకున్నారు.

పండుగ సందడి
నింగిలోకి దూసుకెళ్లిన మూడు సింగపూర్‌ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యల్లోకి చేరవేసిన విజయాశ్వం పీఎ్‌సఎల్వీ

రాకెట్‌ పేరు : పీఎ్‌సఎల్వీ-సీ53

తయారీ ఖర్చు : రూ.130 కోట్లు 

ఎత్తు : 44.4 మీటర్లు 

బరువు : 228.4 టన్నులు 

ఉపగ్రహాలు : 3 (సింగపూర్‌)

1. డీఎ్‌స-ఈవో (365కిలోలు)

2. ఎన్‌ఈయూఎ్‌సఏఆర్‌ (బరువు 155 కిలోలు)

3. స్కూబ్‌-1 (బరువు 2.8 కిలోలు)

                   ( సూళ్లూరుపేట)

ఇస్రో విజయాశ్వంగా పేరుపడ్డ పీఎ్‌సఎల్వీ మరోసారి  రోదసిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలోని రెండవ ప్రయోగవేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు జరిగిన ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ఈసారి సందర్శకులను అనుమతించడంతో షార్‌ ఆవరణం చాలాకాలం తర్వాత సందడిగా మారింది.రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు పలు ప్రాంతాలనుంచి మీడియా సిబ్బందితో పాటు ప్రజలు పెద్దఎత్తున షార్‌కు చేరుకున్నారు.

పీఎ్‌సఎల్వీ-సీ53 ప్రయోగాన్ని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తూ కోలాహలంగా గడిపారు. ప్రయోగం విజయవంతమవడంతో షార్‌ శాస్త్రవేత్తలంతా పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు.షార్‌లోని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలతో కలసి మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించారు.ఇదే ఉత్సాహంతో చంద్రయాన్‌,గగనయాన్‌ ప్రయోగాలను కూడా విజయవంతం చేస్తామని ప్రకటించారు.చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను  ఖచ్చితంగా దించుతామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. 

చెంగాళమ్మ ఆశీస్సులు 

సూళ్లూరుపేట, జూన్‌ 30 : ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ భార్య, కుమార్తెతో గురువారం ఉదయం సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లిని దర్శించుకున్నారు. షార్‌లో ప్రతి రాకెట్‌ ప్రయోగానికి ముందు చెంగాళమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా అనుసరిస్తున్నారు. గురువారం సాయంత్రం ప్రయోగం జరుగుతున్న నేపథ్యంలో ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ చెంగాళమ్మ ఆలయానికి చేరి అమ్మణ్ణికి పూజలు చేశారు.ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆయన్ను స్వాగతించి దర్శనానంతరం వేదపండితులచే ఆశీర్వచనం చేయించారు, అమ్మణ్ణి ప్రసాదాలు అందజేశారు. షార్‌ ఎంఎ్‌సఈ డైరెక్టర్‌ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

ముక్కంటికి పూజలు 

శ్రీకాళహస్తి, జూన్‌ 30: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం ఇస్రో డైరెక్టర్ల బృందం దర్శించుకుంది.పీఎ్‌సఎల్‌వీ-సీ53 ప్రయోగం విజయవంతం కావాలని పూజలు జరిపింది. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వారికి ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.స్వామిఅమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2022-07-01T06:35:04+05:30 IST