‘ఎరువుల ధరలు తగ్గించాలి’

ABN , First Publish Date - 2021-04-11T05:11:11+05:30 IST

కేంద్రం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కోరుతూ శనివారం సీపీఎం, సీపీఐ (ఎమ్‌ఎల్‌) రైతు సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు.

‘ఎరువుల ధరలు తగ్గించాలి’

నందికొట్కూరు, ఏప్రిల్‌ 10: కేంద్రం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కోరుతూ  శనివారం సీపీఎం, సీపీఐ (ఎమ్‌ఎల్‌) రైతు సంఘాల ఆధ్వర్యంలో  అంబేడ్కర్‌ విగ్రహం సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, కార్మిక సంఘం జిల్లా నాయకులు పక్కిర్‌సాహెబ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు 58 శాతం పెంచడం అన్యాయం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెస్తరాజు, ఓబులేసు, శ్రీనివాసులు, మదారుసా, రైతులు వున్నారు.
చాగలమర్రి: కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని సీపీఎం నాయకుడు గుత్తి నరసింహులు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మహబూబ్‌బాషా కోరారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వారు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భారీగా ఎరువుల ధరలు పెంచి రైతులపై మోయలేని భారం మోపాయని ఆరోపించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ప్రకృతి వైపరీత్యాలతో సరైన దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎరువుల భారం మరింత గుదిబండగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు మాబువలి, పకృద్దీన్‌, దస్తగిరి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T05:11:11+05:30 IST