పోషకాహార లోపంతో ఫెర్టిలిటీ దూరం

ABN , First Publish Date - 2020-04-02T16:48:28+05:30 IST

హెల్తీ డైట్ అనేది కేవలం గుండెకు, బ్రెయిన్‌కు మాత్రమే కాదు స్పెర్మ్ (వీర్యం)కు కూడా మంచిదని తాజా పరిశోధనల్లో తేలింది. 19 ఏళ్ల సగటు వయసున్న 2,900 మందిపై జరిపిన పరిశోధనల్లో ఈ

పోషకాహార లోపంతో ఫెర్టిలిటీ దూరం

ఆంధ్రజ్యోతి(02-04-2020)


హెల్తీ డైట్ అనేది కేవలం గుండెకు, బ్రెయిన్‌కు మాత్రమే కాదు స్పెర్మ్ (వీర్యం)కు కూడా మంచిదని తాజా పరిశోధనల్లో తేలింది. 19 ఏళ్ల సగటు వయసున్న 2,900 మందిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపలు, చికెన్, కూరగాయలు, పండ్లు, నీళ్లు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకునే వారిలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా కనిపించిందట. పోషకాహార లోపం మగవారి గుండె, మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయనేది పాత మాట. వాటితో పాటు స్పెర్మ్ మీదా ప్రభావం చూపిస్తుందనేది తాజా పరిశోధనల సారం. స్మోకింగ్, రేడియేషన్, పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్(బంగారం, స్టీల్ చైన్లు, వెండి వస్తువులు) భారీగా వేసుకుని తిరగడం వల్ల కూడా స్పెర్మ్‌లో క్వాలిటీ తగ్గుతుంది. ఈ రీసెర్చ్ ఫలితాల తర్వాత సంతానోత్పత్తి కోసం కూడా ఆహార అలవాట్టు మార్చుకోవలసిందేనంటున్నారు నిపుణులు.

Updated Date - 2020-04-02T16:48:28+05:30 IST