Abn logo
Jul 27 2021 @ 00:29AM

ఆర్‌బీకేలలో అందుబాటులో ఎరువుల ధరలు

ఎరువులు పరిశీలిస్తున్న ఏవో

తాళ్లూరు, జూలై 26 : రైతుభరోసా కేంద్రాల్లో రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు ఉంచినట్లు మండల వ్యవసాయాధికారి బి.ప్రసాద్‌ తెలిపారు. తాళ్లూరు వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకేంద్రంలో అ మ్మకానికి సిద్ధంగా ఉంచిన ఎరువులను వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు సోమవారం పరిశీలించారు. వేపపూత పూసిన నాగార్జునయూరియా బస్తాధర రూ.266-50, గ్రోమోర్‌ 20-20-13 బస్తా ధర రూ.950లు, గోదావరి డీఏపీ రూ.1193లు, ఇన్‌ఫో 20-20-రూ.975లు, అందుబాటులో వున్నాయన్నారు. రైతులు తమ గ్రామాలకు చెందిన వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాలకు వెళ్లి ఎరువులను కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో నాగరాజు, వీఏఏ నాగరాజు నాయక్‌ , ఉన్నారు.