ఫెరారీ... ఎలక్ట్రిక్ వాహనం.. 2025 లో మార్కెట్‌లోకి...

ABN , First Publish Date - 2021-04-22T00:52:28+05:30 IST

వాతావరణంలో మార్పులను, పర్యావరణ కాలుష్యాన్నీ తట్టుకునే క్రమంలో వాహన తయారీ సంస్థలు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే.

ఫెరారీ... ఎలక్ట్రిక్ వాహనం.. 2025 లో మార్కెట్‌లోకి...

మారనెలో(ఇటలీ) : వాతావరణంలో మార్పులను, పర్యావరణ కాలుష్యాన్నీ తట్టుకునే క్రమంలో వాహన తయారీ సంస్థలు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... వాహనకాలుష్యాన్ని తగ్గించేందుకు కంపెనీలు అదునాతన ఇంజిన్లను వినియోగిస్తున్నాయి. భారత్‌లో కూడా బీఎస్-6 ఇంజన్లను మాత్రమే కొత్త వాహనాల తయారీలో వాడాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.


ఈ క్రమంలో గ్రీన్ ఎనర్జీ నినాదాన్ని అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలు ఈ జాబితాలో... ప్రముఖ కార్ల కంపెనీ ఫెరారీ కూడా చేరింది. ఇప్పటికే నిర్వహించిన యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ఫెరారీ సంస్థ... పూర్తిగా బ్యాటరీతో నడిచే విద్యుత్తు వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించింది. మొట్టమొదటి విద్యుత్తు వాహనాన్ని ఫెరారీ 2025 లో విడుదల చేయనుంది.


ఫెరారీ నిర్వహించిన ఓ సమావేశంలో సంస్థ సీఈఓ జాన్ ఎల్కాన్ మాట్లాడుతూ... చరిత్రలో నిలిచిపోయేలా తమ కంపెనీ నుంచి విద్యుత్తు వాహనం విడుదల కానుందని చెప్పారు. దీనిని మరో మూడేళ్ళలో లాంఛ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో... క్వాడ్ మోటార్ సెటప్‌తో మొత్తం నాలుగు ఇంజిన్లు ఉంటాయని సంస్థ తెలిపింది. ఫెరారీ ఇప్పటికే కొన్ని వాహనాలను ఎలక్ట్రిఫికేషన్ చేసిన విషయం తెలిసిందే. లా ఫెరారీ, ఎస్‌ఎఫ్90 స్ట్రాడేల్, స్పైడర్ తదితర హైబ్రిడ్ సూపర్ కార్లను సంస్థ విడుదల చేసింది.


అయితే... 2025 లో విడుదల కానున్న వాహనం... సంస్థ నుంచి రానున్న మొట్టమొదటి పూర్తిస్తాయి విద్యుత్తు వాహనం కావడం విశేషం. ఇక ప్రీమియం కార్ల విభాగంలో ఫెరారీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. పోటీ సంస్థలు ఇప్పటికే కొత్త మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో 

Updated Date - 2021-04-22T00:52:28+05:30 IST