చిన్న రిచార్జ్ చేసిన మహిళా జడ్జి.. అంతలోనే బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షలు మాయం

ABN , First Publish Date - 2022-06-03T09:24:54+05:30 IST

నిద్ర లేచిన తర్వాత చిన్న రీచార్జ్ చేసుకుందా మహిళా జడ్జి. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకొని బయటకు వెళ్లింది. కాసేపటికే ఆమె ఖాతా నుంచి ఏకంగా రూ.2.75 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు మెసేజ్ ..

చిన్న రిచార్జ్ చేసిన మహిళా జడ్జి.. అంతలోనే బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షలు మాయం

నిద్ర లేచిన తర్వాత చిన్న రీచార్జ్ చేసుకుందా మహిళా జడ్జి. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకొని బయటకు వెళ్లింది. కాసేపటికే ఆమె ఖాతా నుంచి ఏకంగా రూ.2.75 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు మెసేజ్ రావడంతో షాకైపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. 


నాగ్‌పూర్‌ సెషన్ కోర్టులో జడ్జిగా పనిచేసే సోనాలీ ముకుంద్ కనక్‌దండే (42) ఖాతా నుంచి ఇంత మొత్తంలో సొమ్ము మాయం అవడంతో.. కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్లిందో ఇంకా తెలియలేదు. 

అయితే జడ్జి బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. 


ఈ హ్యాకర్లు ఎక్కడి నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జడ్జిగారి డబ్బులు ఏ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశారో.. దాని వివరాలు త్వరలోనే తెలుస్తాయని ఆ తరువాతే విచారణ ముందుకు సాగుతుందని సైబర్ పోలీసులు చెప్పారు.


Updated Date - 2022-06-03T09:24:54+05:30 IST