ఎంజీఎం ఆస్పత్రి ఎదుట ఆడశిశువు

ABN , First Publish Date - 2020-10-31T07:29:00+05:30 IST

ఆడ శిశువు పుట్టిందని పురిట్లోని బిడ్డను చెత్తకుండీలు, మురికికాలువల్లో పారేసి చేతులు దులుపుకున్న వార్తలు ఇప్పటివరకు ఎన్నో విన్నాం. కానీ ఇక్కడ పురిట్లోని బిడ్డను చెత్తబుట్టలు, కాలువల్లో పారేయలేక కొందరు

ఎంజీఎం ఆస్పత్రి ఎదుట ఆడశిశువు

అర్ధరాత్రి వదిలి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు 

ఆస్పత్రిలో చేర్చిన మట్టెవాడ పోలీసులు


హన్మకొండ అర్బన్‌, అక్టోబరు 30: ఆడ శిశువు పుట్టిందని పురిట్లోని బిడ్డను చెత్తకుండీలు, మురికికాలువల్లో పారేసి చేతులు దులుపుకున్న వార్తలు ఇప్పటివరకు ఎన్నో విన్నాం.  కానీ ఇక్కడ పురిట్లోని బిడ్డను చెత్తబుట్టలు, కాలువల్లో పారేయలేక కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి (ఎంజీఎం) గేటు మందు వదిలి వెళ్లారు. ఆ సమయంలో ఎంజీఎం ఆస్పత్రి పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది గేటు వద్ద శిశువును గుర్తించి మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే మట్టెవాడ ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి శిశువును ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు.  

Updated Date - 2020-10-31T07:29:00+05:30 IST