Abn logo
Oct 14 2021 @ 11:46AM

ఒంటరిగా ఉంటున్న ఆమె శవమై ఉరితాడుకు వేలాడుతోంది.. ఇంతలో భర్త పరారయ్యాడు.. ఇంతకీ ఇది హత్యా? ఆత్మహత్యా?

కొందరి వైవాహిక సంబంధాలు ఊహించిన రీతిలో ఛిధ్రమవుతుంటాయి. యూపీలోని అలీగఢ్‌లోని క్వార్సీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రమేష్ విహార్‌లో ఒక వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆమె ఉంటున్న గది తలుపులు బద్దలు కొట్టారు. ఆ వైద్యురాలు భర్త నుంచి విడాకులు తీసుకున్నాక, ఈ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నారు. ఆమె ఆత్మహత్య అనంతరం ఆమె భర్త కనిపించకుండా పోయారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రమేష్ విహార్‌లో ఉంటున్న డాక్టర్ ఆస్థా మెడికల్ ఆఫీసర్. హర్దువాగంజ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కంట్రోల్ రూమ్ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. 


ఈ వైద్యురాలికి కాసిమ్‌పూర్‌లో  ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఉంది. కరోనా కాలంలో ఈ వైద్యురాలు ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. డాక్టర్ ఆస్థా మృతి చెందారని తెలియగానే జనం ఆమె ఇంటిముందు గుమిగూడారు. పోలీసులు వారిని అక్కడినుంచి పంపించే ప్రయత్నం చేశారు. కాగా డాక్టర్ ఆస్థాకు, అమె భర్తకు గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. దీంతో ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారు. కాగా ఆమె అత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైనా హత్యచేసి ఇలా చిత్రీకస్తున్నారా? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గడచిన 24 గంటల్లో ఆమెను ఎవరు కలుసుకున్నారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం కొంతమేరకు క్లారిటీ వస్తుందని పోలీసులు అంటున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...