ఆటోలోనే మహిళ ప్రసవం

ABN , First Publish Date - 2022-05-19T05:11:43+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోనే ఆటో లో మహిళ ప్రసవించింది.

ఆటోలోనే మహిళ ప్రసవం
బాలింతతో మాట్లాడుతున్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కిశోర్‌కుమార్‌

- డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యమేనని 

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

- సిబ్బంది నిర్లక్ష్యం లేదన్న 

ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌  

గద్వాల క్రైం, మే 18: ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోనే ఆటో లో మహిళ ప్రసవించింది. అయితే, ఆస్పత్రి వైద్యుల, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయ్యింది. ఇందుకు సంబంధించి బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గద్వాల పట్టణానికి చెందిన అ రుణ అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ స భ్యులు బుధవారం ఉదయం 5.10గంటలకు ఆటోలో ఆస్పత్రికి తీసువచ్చారు. ఆసుపత్రి ఆవరణలో ఆటోలనే 30నిమిషాల పాటు ఉన్నా సిబ్బంది సరిగా స్పందించలేదని  బాధితులు ఆ వేదన వ్యక్తం చేశారు. తీరా ఉదయం 5.42 గంటలకు ఆటో లోనే గర్భిణి  ప్రసవించిన ఎవరూ స్పందించలేదని వాపో యారు. ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమంటూ కొందరు ఓ వీడియోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేయడంతో అప్పుడు స్పందించారని కుటుంబ సభ్యులు తెలిపారు.  ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కిశోర్‌ కుమార్‌ స్పందిస్తూ తమ సి బ్బంది నిర్లక్ష్యం లేదన్నారు. ఆస్పత్రికి వచ్చి సీసీ కెమెరాను పరి శీలించామన్నారు. గర్భిణి వచ్చే సమయానికే పరిస్థితి సీరి యస్‌గా ఉండటంతో ఆటోలోనే ప్రసవించిందన్నారు.  ప్రస్తు తం తల్లి, బిడ్డ క్షేమం గా ఉన్నారన్నారు.  ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నతమైన సేవలు అందిస్తున్నాం, ఇలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. 

Updated Date - 2022-05-19T05:11:43+05:30 IST