పీజీ కోర్సులకు ఫీజులు ఖరారు

ABN , First Publish Date - 2021-04-16T10:01:54+05:30 IST

రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) కోర్సులకు ట్యూషన్‌ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. పీజీ కోర్సులను మాస్టర్‌ ఇన్‌

పీజీ కోర్సులకు ఫీజులు ఖరారు

2020-21 నుంచి 2022-23 వరకు వర్తింపు

కోర్సులను 3 కేటగిరీలుగా విభజించి నిర్ధారణ 


అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) కోర్సులకు ట్యూషన్‌ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. పీజీ కోర్సులను మాస్టర్‌ ఇన్‌ ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌(ఎంఏ), మాస్టర్‌ ఇన్‌ కామర్స్‌(ఎంకాం), మాస్టర్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఎంఎస్సీ) విభాగాలుగా చేసి మూడు కేటగిరీల్లో ఫీజులను నిర్ధారించారు. ఈ ఫీజులు 2020-21, 2021-22, 2022-23 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయి. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిఫారసులను ఆమోదిస్తూ ఉన్నత విద్య స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌ చంద్ర గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 


కేటగిరీల వారీగా ఫీజులు ఇలా... 

కేటగిరీ-1: ఎంఏ కోర్సుల్లో కనిష్ఠ ఫీజు రూ.11 వేలు. గరిష్ఠ ఫీజు రూ.30 వేలు. ఎంకాం ఫీజు రూ.15,400. ఎంఎస్సీలో కనిష్ఠ ఫీజు రూ.24,200, గరిష్ఠ ఫీజు రూ.49,500.

కేటగిరీ-2: ఎంఏ కోర్సుల్లో కనిష్ఠ ఫీజు రూ.10 వేలు, గరిష్ఠ ఫీజు రూ.27 వేలు. ఎంకాం ఫీజు రూ.14,000. ఎంఎస్సీ కో ర్సులో కనిష్ఠ ఫీజు రూ.22,500, గరిష్ఠ ఫీజు రూ.45 వేలు.

కేటగిరీ-3: ఎంఏ కోర్సుల్లో కనిష్ఠ ఫీజు రూ.9 వేలు, గరిష్ఠ ఫీజు రూ.24,300 వేలు. ఎంకాం కోర్సు ఫీజు రూ.12,600. ఎంఎస్సీ కోర్సులో కనిష్ఠ ఫీజు రూ.19,800, గరిష్ఠ ఫీజు రూ.40,500గా ఖరారు చేశారు. 

Updated Date - 2021-04-16T10:01:54+05:30 IST