feel down about yourself : కారణం లేకుండానే దిగులుగా అనిపిస్తుందా? మీ ఆనందాన్ని పెంచడానికి ఈ 6 అలవాట్లు చేసుకోండి..

ABN , First Publish Date - 2022-08-18T17:17:18+05:30 IST

లైఫ్ లో జరిగే కొన్ని నచ్చని సంఘటనలైనా.. అనుకోకుండా తీసుకోవాల్సివచ్చిన నిర్ణయాలైనా నిరాశా, దిగులులోనికి తోసేస్తాయి.

feel down about yourself : కారణం లేకుండానే దిగులుగా అనిపిస్తుందా? మీ ఆనందాన్ని పెంచడానికి ఈ 6 అలవాట్లు చేసుకోండి..

మనలో చాలా మంది కారణం లేకుండానే దిగాలు పడిపోతారు.. ఈ దిగులుకు పెద్దగా కారణాలు అవసరం లేదు.. లైఫ్ లో జరిగే కొన్ని నచ్చని సంఘటనలైనా.. అనుకోకుండా తీసుకోవాల్సివచ్చిన నిర్ణయాలైనా నిరాశా, దిగులులోనికి తోసేస్తాయి. ఇది నెమ్మదిగా మన మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు హార్మోన్ల బ్యాలెన్స్ కూడా తప్పుతుంది. దీనితో సెరోటోనిన్ స్థాయిలు పెరగటం, కోరికలను అణచుకోవడం ఇలా జీవనశైలిలో అనేక మార్పులు వస్తాయి. నిద్ర సరిగా ఉండకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఒత్తిడిని తీసుకోలేకపోవడం ఈ దిగుళ్లలో సరైన జీవనశైలి లేక సమతుల్యత దెబ్బతింటుంది. 


ఈ నిరాశ, దిగులు నుంచి త్వరగా బయటపడాలి అనుకునేవారు రోజులో 15 నుంచి 20 నిముషాలు కేటాయించి మంచి వ్యాయామాలు చేయడం ఎంతైనా అవసరం. ఇది మానసిక స్థితిని త్వరగా గాడిలో పెడుతుంది. సాధారణంగా వ్యాయామాన్ని దినచర్యలో పాటించడం వల్ల శారీరకంగా ఫిట్ గా ఉండగలమని, జీవన శైలిలో ఎదురయ్యే రుగ్మతలను దాటగలమనే ధైర్యం కలుగుతుంది. 


1) చురుకైన నడక అలవాటు చేసుకోండి : చాలామంది నడక అనగానే దానితో మన శరీరంలో అంతగా మార్పు ఏం వస్తుందనే చిన్న అభిప్రాయం లేకపోలేదు. నడక శరీరాన్ని కండరాలను కదుపుతూ ఉత్తేజం చేస్తుంది. రోజూ 30 నుంచి 45 నిముషాల వరకూ మీరు చేసే నడక శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. 


2) రన్నింగ్ చేయండి :  రన్నింగ్ చేయడం వల్ల హృదమం, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతి రోజూ 20 నుంచి 30 నిముషాల పాటు వారంలో రెండు మూడు సార్లు చేసినా మంచి ఫలితం ఉంటుంది. 


3) బరువు తగ్గండి : శరీరం మోస్తున్న అధిక బరువు కూడా ఒక్కోసారి దిగులు, నిరాశకు కారణం కావచ్చు. అదే మీ సమస్య అయితే ఓ ప్రణాళిక ప్రకారం బరువు తగ్గడానికి చూడండి. ముందుగా ఆహారంలో మార్పులు చేసుకోండి. ఆపైన వ్యాయామాలు, నడక ప్రారంభించండి.      

కాళ్లు, ఛాతీ, భుజాలు, వీపు, చేతులు వంటి ప్రధాన కండరాలు కదిలే విధంగా వ్యాయామాలు చేయడం మంచిది.


4) యోగా చేయండి : వారానికి 2-3 రోజులు యోగా చేయడం మంచి దీనితో శారీరక బలం, మెదడుకు ప్రశాంతతా కలుగుతాయి. అలాగే ఈ ఆసనాలు మన మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతాయి.


5) హైకింగ్ లేదా ట్రెక్కింగ్: సహజమైన ప్రకృతి, పచ్చటి పరిసరాలలో చేసే శారీరక శ్రమ ఏదైనా ఖచ్చితంగా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని శారీరకంగా దృఢంగా ఉంచుతుంది.


6) క్రీడలు ఆడటం కూడా మంచిదే : స్నేహితులతో కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ వంటి మీకు నచ్చిన క్రీడను వారానికి కనీసం 1-2 సార్లు ఒక గంట పాటు ఆడటం వలన మానసిక ఉల్లాసం కలుగుతుంది. 

ఇలాంటి అలవాట్లతో కమ్ముకున్న దిగులు, నిరాశలు పోయి, చక్కని ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది.

Updated Date - 2022-08-18T17:17:18+05:30 IST