నిషేధిత రసాయనాలతో పశువుల దాణా

ABN , First Publish Date - 2020-09-19T09:57:27+05:30 IST

ఆటోనగర్‌ కేంద్రంగా చేసుకొని నిషేధిత రసాయ నాలు వినియోగించి పశుదాణా తయారు చేస్తున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులు మూకు మ్మడిగా దాడి చేసి శుక్రవారం ఈ వ్యవ హారాన్ని వెలుగు

నిషేధిత రసాయనాలతో పశువుల దాణా

 ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలో వెలుగులోకి..


పెదకాకాని, సెప్టెం బరు 18: ఆటోనగర్‌ కేంద్రంగా చేసుకొని నిషేధిత రసాయ  నాలు వినియోగించి పశుదాణా తయారు చేస్తున్నారు.  ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులు మూకు మ్మడిగా దాడి చేసి శుక్రవారం ఈ వ్యవ హారాన్ని వెలుగులోకి తెచ్చారు. దీనికి సంబంధించి వివరాలలోకి వెళితే.. ఆటోనగర్‌లోని హైవేకి దగ్గరలో కొందరు వ్యక్తులు ఒక గూడెంను అద్దెకు తీసుకొని అందులో నిషేధిత రసాయనాలను వినియోగించి పశువుల దాణా తయారు చేస్తున్నారు.


పత్తి గింజలు, వరిపొట్టు, వేరుశనగ వ్యర్ధాలను ఉపయోగించి హానికరమైన రసాయనాలతో పశుదాణా తయారు చేస్తున్నారు. లూథియానా ప్రాంతానికి చెందిన ఔరోమినే - 0 అనే హానికర రంగులను తీసుకొచ్చి వినియోగిస్తున్నారు. ఈ రసాయనాలు విషాహారంతో సమానం అని, అవి తిన్న పశువులు అనారోగ్యానికి గురవుతాయని అధికారులు తెలిపారు.


ఆ గేదె పాలు తాగినా, పెరుగు తిన్నా అనారోగ్యానికి గురికావలసిందేనని ఫుడ్‌ అధికారులు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటామని అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ షేక్‌ గౌస్‌ముద్దీన్‌ తెలిపారు. ఈ దాడుల్లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకటేశ్వరావు, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్స్‌ ఎ.సుందరరామిరెడ్డి, పి.ప్రణవ్‌కుమార్‌, ఎన్‌.వెంకటేశ్వరరావు, పశు వైద్యాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-19T09:57:27+05:30 IST