ఏబీవీపీ దీక్ష విరమణ

ABN , First Publish Date - 2020-02-20T09:13:09+05:30 IST

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పల పెండింగ్‌ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆ సంఘం నేతలు చేపట్టిన 48 గంటల దీక్షను బుధవారం ఉదయం విరమించారు.

ఏబీవీపీ దీక్ష విరమణ

కలెక్టరేట్‌ ముట్టడి యత్నం... భగ్నం చేసిన పోలీసులు... నేతల అరెస్టు


అనంతపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పల పెండింగ్‌ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆ సంఘం నేతలు చేపట్టిన 48 గంటల దీక్షను బుధవారం ఉదయం విరమించారు. ఏబీవీపీ కేంద్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు హరికృష్ణ దీక్షకు కూర్చున్న ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిని నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి చల్లా కౌశిక్‌, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కలిసి కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఏబీవీపీ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాటకు దారితీసింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తుంటే బలవంతంగా అరెస్టులు చేయడమేంటని పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు బలవంతంగా ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.


అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇదిలా ఉండగా... అంతకు ముందు ఏబీవీపీ కేంద్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు హరికృష్ణ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పల నిధులు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. నాడు కావాలి జగన్‌... రావాలి జగన్‌ అన్న విద్యార్థులే ప్రస్తుతం పోవాలి జగన్‌.... లోటస్‌ పాండ్‌లో విశ్రాంతి తీసుకోవాలంటూ నినాదాలు చేస్తున్నారంటే ఆయన 9 నెలల పాలనకు అద్దం పడుతోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు లలిత్‌కుమార్‌, అరుణ్‌కుమార్‌రెడ్డితో పాటు ఏబీవీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు సాయినాథ్‌, సాయితేజ, వెంకటే్‌ష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:13:09+05:30 IST