ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజ్ రెగ్యులేట్ కమిటీ వార్నింగ్

ABN , First Publish Date - 2021-07-27T02:37:33+05:30 IST

ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజ్ రెగ్యులేట్ కమిటీ వార్నింగ్

ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజ్ రెగ్యులేట్ కమిటీ వార్నింగ్

హైదరాబాద్: తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజ్ రెగ్యులేట్ కమిటీ వార్నింగ్ ఇచ్చింది. ఒకేసారి ఫీజులు వసూలు చేస్తున్నారంటూ కమిటీకి ఏబీవీపీ పిర్యాదు చేసింది. బీటెక్ విద్యార్థినీ లావణ్య ఆత్మహత్యకు కారణం ఫీజుల వసూళ్లేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు ఏఐసీటీ నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజు తీసుకోవాలని తెలిపింది. ఒకే విడుతలో ఫీజులు కట్టాలని ఒత్తిడి తెచ్చే కాలేజీలపై చర్యలు తప్పవని ఫీజ్ రెగ్యులేట్ కమిటీ హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితిని యాజమాన్యాలు అర్థం చేసుకోవాలని రాచకొండ కమిషనరేట్ పేర్కొంది.

Updated Date - 2021-07-27T02:37:33+05:30 IST