ఎండు చేపలు అమ్ముతూ నిరసన తెలుపుతున్న విద్యార్థులు
నూజివీడు టౌన్, జనవరి 24: పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) చదువుతున్న విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం నూజివీడులో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. నూజివీడు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎండు చేపలు, కూరగాయలు అమ్ముతూ విద్యార్థులు నిరసన తెలిపారు. గతంలో మాదిరిగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పి.కుమార్‌బాబు, రవీంద్రబాబు, నవీన్ హుస్సేన్ పాల్గొన్నారు.