మెడికల్, డెంటల్ ఫీజుల చెల్లింపునకు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-02-22T01:56:44+05:30 IST

ప్రైవేట్‌ మెడికల్, డెంటల్, ఆయుష్, నర్సింగ్, పారామెడికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ విద్యాసంస్థల్లో ఫీజుల చెల్లింపులకు గడువును మరో రెండు వారాలు పొడిగించారు. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ (ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ) సభ్య కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌. రాజశేఖర్‌రెడ్డి శుక్ర‌వారం ఈ మేరకు ఒక ప్రకటన విడుద‌ల చేశారు.

మెడికల్, డెంటల్ ఫీజుల చెల్లింపునకు గడువు పెంపు
students

విజయవాడ : ప్రైవేట్‌ మెడికల్, డెంటల్, ఆయుష్, నర్సింగ్, పారామెడికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ విద్యాసంస్థల్లో ఫీజుల చెల్లింపులకు గడువును మరో రెండు వారాలు పొడిగించారు. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ (ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ) సభ్య కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌. రాజశేఖర్‌రెడ్డి శుక్ర‌వారం ఈ మేరకు ఒక ప్రకటన విడుద‌ల చేశారు.


ప్రైవేట్‌ మెడికల్, డెంటల్‌ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్‌ విజ్ఞప్తి మేరకు మార్చి 14 వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్టు తెలిపారు. మెడికల్‌లో యూజీ, పీజీ, సూపర్‌ స్పెషాలిటీ, డెంటల్‌లో యూజీ, పీజీ, ఆయుష్, నర్సింగ్‌లో యూజీ, పీజీ, డిప్లొమో, పారామెడికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ ప్రోగ్రాములు నిర్వహించే ప్రైవేట్‌ అన్‌‌ఎయిడెడ్‌ ప్రొఫెషనల్‌ విద్యాసంస్థలు ఈ గడువులోగా తమ సమాచారాన్ని aphermc.ap.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని రాజశేఖర్‌రెడ్డి సూచించారు.


Updated Date - 2020-02-22T01:56:44+05:30 IST