ఫెడెక్స్‌ కార్యాలయంలో కాల్పులు

ABN , First Publish Date - 2021-04-17T07:33:12+05:30 IST

అమెరికాలోని ఇండియానా పోలిస్‌ విమానాశ్రయం సమీపంలో ఉన్న ‘ఫెడెక్స్‌’ కొరియర్‌ సంస్థలో గురువారం రాత్రి 11 గంటలకు ఆగంతకుడు చొరబడి 8 మందిని కాల్చిచంపాడు

ఫెడెక్స్‌ కార్యాలయంలో కాల్పులు

అమెరికాలో 8 మంది పౌరులు బలి

హంతకుడి ఆత్మహత్య.. క్షతగాత్రుల్లో భారతీయ యువతి


ఇండియానా పోలిస్‌, ఏప్రిల్‌ 16: అమెరికాలోని ఇండియానా పోలిస్‌ విమానాశ్రయం సమీపంలో ఉన్న ‘ఫెడెక్స్‌’ కొరియర్‌ సంస్థలో గురువారం రాత్రి 11 గంటలకు ఆగంతకుడు చొరబడి 8 మందిని కాల్చిచంపాడు. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు గాయపడ్డారు. ఆగంతకుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8.30 గం టలకు ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపింది ఫెడెక్స్‌ ఉద్యోగా? బయటి వ్య క్తా తెలియరాలేదు. గత నాలుగు నెలల వ్యవధిలో ఇండియానా రాష్ట్రంలో కాల్పు ల సంఘటన జరగడం ఇది మూడోసారి. గత నెలలో అట్లాంటాలో 8 మంది. కొలరాడోలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఫెడెక్స్‌ ప్రాంగణంలో జరిగిన కాల్పుల్లో భారతీయ యువతి ఒకరు గాయపడ్డారు. ఆమె కారులో కూర్చొని ఉండగా ఆగంతకుడు కాల్పులు జరిపారు. ఆమె భుజంలో బుల్లెట్‌ దిగింది. 

Updated Date - 2021-04-17T07:33:12+05:30 IST