Abn logo
Mar 26 2020 @ 16:37PM

కరోనా బాధితులకు ఫెదరర్ భారీ విరాళం

బెర్న్: 21 సార్లు టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేతగా నిలిచిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన ఉదారతని మరోసారి చాటుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన స్వదేశమైన స్విట్జర్లాండ్‌లో కరోనాతో బాధపడుతున్న వారి సహాయార్థం అతను భారీ విరాళాన్ని ప్రకటించాడు. కరోనాతో బాధపడుతున్న వారి కుటుంబాలను ఆదుకొనేందుకు ఫెదరర్, అతని సతీమణి కలిసి ఒక మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.7.8 కోట్లు) విరాళంగా అందిస్తున్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎవరిని కూడా ఒంటరిగా వదలేయకూడదు’’అంటూ అతను సోషల్‌మీడియా ద్వారా పేర్కొన్నాడు. ‘‘ఈ విరాళం కేవలం ఆరంభం మాత్రమే. మాలాగే అందరు కూడా ఈ వైరస్‌పై పోరాడేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. అంతా కలిసికట్టుగా పోరాడితే ఈ సంక్షోభాన్ని దాటగలము’’ అని ఫెదరర్ తెలిపాడు. 

Advertisement