Advertisement
Advertisement
Abn logo
Advertisement

మార్కెట్ ను ఆకర్షించిన ఫెడరల్ బ్యాంక్...


హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో గట్టి నంబర్లను పోస్ట్‌ చేసిన ఫెడరల్‌ బ్యాంక్... మార్కెట్‌ మన్ననలనందుకుంది. ఫలితాల విషయానికొస్తే.... నికర లాభంలో 50 % వృద్ధిని కనబరచింది. ఈ త్రైమాసికంలో ఆదాయాలు తగ్గినప్పటికీ... ప్రొవిజన్స్‌ పడిపోయాయి, ఆస్తుల నాణ్యత ఆకర్షణీయంగా మారింది. ఇక బ్యాంక్‌ నికరలాభం ఈ దఫా రూ. 460 కోట్లకు చేరింది. కాగా గతేడాదిలోని 3,937 కోట్లతో పోలిస్తే, సెప్టెంబరు త్రైమాసికంలో రూ. 3,824 కోట్లు వచ్చాయి. దీని ఫలితంగా ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ కూడా రూ. 947 కోట్ల నుంచి రూ. 865 కోట్లకు తగ్గింది.


ఇక ప్రొవిజన్స్‌లో మాత్రం బ్లాక్‌బస్టర్‌ నంబర్స్‌ను ప్రకటించింది ఫెడరల్‌ బ్యాంక్‌. ప్రొవిజన్స్‌ను ఏకంగా 54 % తగ్గించి, రూ. 245 కోట్లకు పరిమితం చేసింది. దీనివల్లే బ్యాంక్‌ నికరలాభం పెరిగింది. ఈ నంబర్లపై మార్కెట్‌ సానుకూలంగా స్పందించింది. స్టాక్‌ జోరుగా పెరిగి, 52 వారాల గరిష్ట స్థాయి రూ. 105.6 కు చేరింది. హయ్యర్‌ పొజిషన్‌లో లాభాల స్వీకరణతో, గత ముగింపు కంటే 8 % అధికంగా, అంటే రూ. 104.5 వద్ద నిలబడింది.

Advertisement
Advertisement