ఒకటి నుంచి అంగన్‌వాడీల పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-01-25T05:36:37+05:30 IST

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు 11నెలల తర్వాత పునఃప్రారంభం కానున్నాయి.

ఒకటి నుంచి   అంగన్‌వాడీల పునఃప్రారంభం
నెల్లూరులోని ఓ అంగన్‌వాడీ కేంద్రం

11 నెలల తరువాత తెరచుకోనున్న కేంద్రాలు

గర్భిణులు, బాలింతలకు ఇంటివద్దకే రేషన్‌

ఆంగ్లమాధ్యమంలోనే చిన్నారుల బోధన

పీడీ ఉమాదేవి వెల్లడి


నెల్లూరు (వీఆర్సీ) జనవరి 24 :  జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు 11నెలల తర్వాత పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ కారణంగా గత ఏడాది ఏప్రిల్‌లో మూతపడిన కేంద్రాలు ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు అంగన్‌వాడీ  కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, బాలింతలు, మూడేళ్లు పైబడిన చిన్నారులకు ఇంటికే రేషన్‌ సరుకులను అందిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది, ఇకపై పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల కు తీసుకువచ్చి పౌష్టికాహారం అందించనున్నారు. అయితే గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు పిల్లలకు మాత్రం కొవిడ్‌ పూర్తిగా తగ్గేవరకు ఇంటికే రేషన్‌ సరుకులు, పాలు, కోడిగుడ్లు, వేరుశనగ చిక్కీలు వంటివి అందిస్తారు.


కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

ఫిబ్రవరి నుంచి పునఃప్రారంభం కానున్న 3,774 అంగన్‌వాడీ కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పా టించాల్సిందేనని మహిళ, శిశుసంక్షేమ శాఖ పీడీ  ఉమాదేవి తెలియజేశారు.ఈ మేరకు కేంద్రాల్లో తీసుకోవాల్పిన జాగ్రత్తల ను అంగన్‌వాడీ కార్యకర్తలకు, సూపర్‌వైజర్లుకు, సీడీపీవోలకు అవగాహన కల్పించి, ప్రభుత్వ ఆదేశానుసారం, జిల్లా కలెక్టర్‌ సూచనలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా రు. భౌతిక దూరం పాటించి, ప్రతిబిడ్డకు మాస్క్‌లను తప్పని సరిగా ధరించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రభు త్వ అంగన్‌వాడీ భవనాలను శుభ్రం చేసేలా వాటి అవస రాల కు  ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించింది. ఈనిధులతో పిల్లలకు అవగాహన కల్పించేలా వివిధ బొమ్మలు వేయించనున్నారు.


వినూత్నంగా  విద్య 

. అంగన్‌వాడీ కేంద్రాల్లో బోధన వినూత్నంగా   ఉంటుంది. సృజనాత్మకంగా ఆట,పాట,మాట, కథల  రూపంలో చదువు చెప్తాం. అంగన్‌వాడీ విద్య పట్ల తల్లిదండ్రుల్లో ఉండే అపోహ లు తొలగించి, విద్యను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నాం. ఆంగ్ల  మాధ్యమంలో బోధించేందుకు కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాం.

                           -మహిళ, శిశు సంక్షేమ శాఖ పీడీ ఉమాదేవి


Updated Date - 2021-01-25T05:36:37+05:30 IST