ప్రబలుతున్న జ్వరాలు

ABN , First Publish Date - 2021-01-18T05:08:07+05:30 IST

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి పద్మనాభ పురం వార్డులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ గ్రా మంలో గత ఐదు రోజులుగా జ్వరాలు వ్యాపిస్తున్నా యి.

ప్రబలుతున్న జ్వరాలు
పేరుకుపోయిన మురుగు

అధ్వానంగా పారిశుధ్యం

ఆందోళనలో పద్మనాభపురం గ్రామస్థులు

(కాశీబుగ్గ)

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి పద్మనాభ పురం వార్డులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ గ్రా మంలో గత ఐదు రోజులుగా జ్వరాలు వ్యాపిస్తున్నా యి. గ్రామంలో నివసిస్తున్న పి.హరీష్‌, అభిరామ్‌, కుసుమబెహర, బేబి, పూజ, చైతన్య, దీపిక, గోవింద్‌, కుమారి, ధర్మారావులకు జ్వరాలు రావడంతో కాశీబుగ్గ లోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమందికి ప్లేట్‌లెట్స్‌ తగ్గడంతో  పాటు ఒళ్లు నొప్పులు, జ్వరం రావడంతో డెంగ్యూ వచ్చిందని జ్వర పీడితులు భయాందోళన చెందుతున్నారు. పద్మనాభ పురంలో రోజుకు ఇద్దరు చొప్పున జ్వరం రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

అపరిశుభ్రత వల్లే...

పద్మనాభపురంలో గత పది రోజులుగా రోడ్లు, డ్రైనేజీలు శు భ్రం చేయకపోవడంతో  దోమ లు విజృంభిస్తున్నాయని, దీంతో జ్వరాలు వ్యాపిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నా రు. అలాగే గ్రామంలో ఉన్న చెరువు పూర్తి కలుషితమయ్యిం దని చెప్పారు. అధి కారులు, మునిసిపా లిటీ సిబ్బంది పట్టిం చుకొని పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు కోరారు. ప్రత్యేక క్యాం పులు ఏర్పాటు చేసి, వైద్య పరీక్షలు నిర్వహిం చాలన్నారు.

వైద్య శిబిరం ఏర్పాటుచేస్తాం

పద్మనాభపురంలో జ్వరాలు ప్రబలడంపై డిప్యూటీ డీఎంహెచ్‌వో లీలాను వివరణ కోరగా, గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీజనల్‌గా పలాస, కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 

 


 

Updated Date - 2021-01-18T05:08:07+05:30 IST