ఫీచర్‌ ఫోన్‌ల కోసం కొత్తఆన్‌లైన్‌ పేమెంట్‌ మోడ్‌

ABN , First Publish Date - 2021-12-18T05:30:00+05:30 IST

డిజిటల్‌ పేమెంట్స్‌ మరింత ఊపు తెచ్చే యత్నంలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఫీచర్‌ ఫోన్లకు యూపీఐ ప్లాట్‌ఫాంను తేనుంది....

ఫీచర్‌ ఫోన్‌ల కోసం కొత్తఆన్‌లైన్‌ పేమెంట్‌ మోడ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌ మరింత ఊపు తెచ్చే యత్నంలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఫీచర్‌ ఫోన్లకు యూపీఐ ప్లాట్‌ఫాంను తేనుంది. మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లు అతి ఎక్కువ ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. దేశంలోని 118 కోట్ల సబ్‌స్ర్కిప్షన్లలో  ఫీచర్‌ ఫోన్లు వాడేవారి సంఖ్యే ఎక్కువ. రిటైల్‌ పేమెంట్స్‌ పేరుతో ఫీచర్‌ ఫోన్లు వాడేవారి కోసం ఇప్పటికే కొంతమంది ప్రయోగాలు చేశారు. 

ఫీచర్‌ ఫోన్లకు సంబంధించిన యూపీఐ ప్లాట్‌ఫాం వివరాలు కొద్ది రోజుల్లోనే వెల్లడి కానున్నాయి. చిన్న టికెట్ల కొనుగోలు కోసం ‘ఆన్‌ డివైస్‌’ వ్యాలెట్‌ కోసం మరో ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. 

Updated Date - 2021-12-18T05:30:00+05:30 IST