బాగా ఊదితే మీరే విన్నర్!
ABN , First Publish Date - 2020-06-13T05:30:00+05:30 IST
సింపుల్‌గా అనిపించినా, ఈ ఆటతో బోలెడు ఫన్ దొరుకుతుంది. టైమ్‌పాస్ అవుతుంది. ఈ ఆట ఆడటం కోసం...
సింపుల్‌గా అనిపించినా, ఈ ఆటతో బోలెడు ఫన్ దొరుకుతుంది. టైమ్‌పాస్ అవుతుంది. ఈ ఆట ఆడటం కోసం
కావలసినవి...
ఈకలు (ప్లాస్టిక్‌వి, తేలికగా ఉండేవి), టైమర్
ఎలా ఆడాలి?
- ఈ ఆటను నలుగురైదుగురు కలిసి ఆడుకోవచ్చు.
- ఒక్కొక్కరు ఒక ఈకను చేతిలోకి తీసుకుని వరుసలో నిల్చోవాలి.
- టైమర్ సెట్ చేసుకోవాలి. ‘గో’ అనగానే ఈకను గాల్లోకి ఊదాలి. తరువాత అది కిందపడకుండా ఊదుతూనే ఉండాలి. ఈకను చేత్తో ముట్టుకోకూడదు.
- ఒక నిమిషం టైమ్ పెట్టుకుంటే కనుక ఆ సమయం వరకు ఈక కిందపడకుండా ఊదుతూనే ఉండాలి.
- ఎక్కువ సమయం ఎవరైతే ఈక కింద పడకుండా గాల్లో ఉండేలా ఊదుతారో వారు గెలిచినట్టు!
- ఈ ఆటను ఇలా కూడా ఆడొచ్చు. ఒక గదిలో బకెట్ ఏర్పాటు చేయలి. మరో గదిలో నుంచి మొదలుపెట్టి ఈకను ఊదుకుంటూ వచ్చి ఆ బకెట్‌లో పడేలా చేయాలి. చేత్తో ముట్టుకోకుండా నెమ్మదిగా ఊదుకుంటూ వెళ్లి ఈకను బకెట్‌లో వేసిన వారు గెలిచినట్టు.