అకాల భయo

ABN , First Publish Date - 2022-05-05T05:22:08+05:30 IST

జిల్లా రైతులను అకాల వర్షాలు భయపెడుతున్నాయి. ఆకాశమంతా కారుమబ్బులు కమ్మేయడంతో రైతులు ఆగమవుతున్నారు.

అకాల భయo
భిక్కనూర్‌లో తడిసిన ధాన్యం

జిల్లాను కమ్మేసిన కారు మబ్బులు

కొన్ని మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు

అకాల వర్షాలతో పలుచోట్ల తడుస్తున్న ధాన్యం

జిల్లాలో 30 శాతం మాత్రమే ధాన్యం కొనుగోళ్లు

మిగిలిన 70 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పంట పొలాల్లోనే..

చేతికి వచ్చిన పంట ఏమవుతుందోనని ఆందోళనలో అన్నదాతలు

కామారెడ్డి, మే 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లా రైతులను అకాల వర్షాలు భయపెడుతున్నాయి. ఆకాశమంతా కారుమబ్బులు కమ్మేయడంతో రైతులు ఆగమవుతున్నారు. కేంద్రాలలోని ధాన్యం పంట పొలాల్లోని వరిని కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. మరో వైపు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు 30 శాతం వరకే జరిగాయి. ఇప్పుడిప్పుడే రైతులు భారీగా ధాన్యాన్ని కేంద్రాలకు తరలిస్తున్నారు. కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో అకాల వర్షాలకు ఎక్కడ తడిసిపోతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెనువెంటేనే కొనుగోలు చేసి తరలించాలం టూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 120 కేంద్రాల్లో 30వేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.

ఆకాశాన్ని కమ్మేస్తున్న మబ్బులు

ప్రతి యాసంగి సీజన్‌లో అకాల, వడగండ్ల వర్షం కుర వడం సాధారణమే. సరిగ్గా కొతల సమయంలోనే కురు స్తుండడంతో ప్రతిఏటా రైతుల ధాన్యం తడిసిపోతుండ డంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల వాతావర ణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మేస్తుండడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. రెండు రోజుల నుంచి జిల్లాలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తుండడంతో కేంద్రాలు, పంట పొలాల్లోనే ధాన్యం తడిసిపోతుంది. కామారెడ్డి, భిక్కనూర్‌, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, రామారెడ్డి తదితర మండలాల్లో కురుసిన అకాల వర్షాలు, వడ గండ్లతో పంటలు దెబ్బతినడమే కాకుండా కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. వడగండ్ల వర్షాల తాకిడికి వడ్లు రాలిపోయి నేల పాలయ్యాయి. మరికొన్నిచోట్ల రోడ్లపై ఆరబోసిన ధాన్యం వర్షం దాటికి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

పరుగులు తీస్తున్న రైతులు

జిల్లాలో వాతావరణం ఉన్నట్టుండి మారి పోవడంతో కేంద్రాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీస్తున్నారు. కోతకు వచ్చిన పొలాలు గాలిదుమారానికి, వర్షానికి అడ్డం పడుతాయని రాశులు ఉన్న ధాన్యం తడిస్తుందేమోనని ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడు ఏ గాలి దుమారం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంటను కోసి కల్లాలు, కేంద్రాల్లో ఆరబెట్టుకున్న రైతులు కుప్పలుగా పోసి పట్టాలు పట్టుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ కొనుగొలు కేంద్రాల్లో సరిపడా టార్పలిన్‌లు అందుబాటులో లేకపోవడంతో తెలిసిన వారి వద్ద కొనుగోలు చేసి ధాన్యం రాశులపై కప్పుకుంటున్నారు.

రైతులను భయపెడుతున్న అకాల వర్షాలు..

జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు ఇప్పుడిప్పుడే దండిగా ధాన్యం వస్తోంది. మరికొన్ని చోట్ల వేలాది ఎకరాలలో వరి కొతలకు సిద్ధంగా ఉంది. అయితే అకాల వర్షాలు రైతు లను భయపెడుతున్నాయి. 10 రోజుల కిందటే  బీర్కూర్‌, బాన్సువాడ,న నస్రూల్లాబాద్‌ తదితర మండలాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వందాది క్వింటాల్లో ధాన్యం తడవగా వరి పంట నేలకు ఒరిగింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండడం, చల్లపడడం, ఆకా శం మబ్బులతో కమ్మేయడంతో ఎక్కడ అకాల వర్షాలు కురుస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. బు ధవారం తెల్లవారుజామున జిల్లాలో పలుచోట్ల అకాల వ ర్షాలు, ఇదురుగాలులతో కూడిన అకాల వర్షం కురువడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.


30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లాలో ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోలు ఊపందుకుం టున్నాయి. రైతులు సైతం ధాన్యాన్ని కేంద్రాలకు తరలి స్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 30 శా తం మాత్రమే ధాన్యంకొనుగోలు చేపట్టారు. ఇం కా 70 శాతం కేంద్రాల వద్దనే ఉన్నాయి. ఈ యాసంగి సీజన్‌లో 3లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా 344 కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే  ఇప్పటివరకు 163 కేంద్రాలను ప్రారంభించగా ఇందులో 180 కేంద్రాల్లో 30వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రూ.60 కోట్లతో 4 వేల 400 మంది రైతుల నుంచి కొనుగోలు చేపట్టారు. ఇందు లో 3600 మంది రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇప్పటివరకు 2100  మంది రైతుల ఖాతాలో రూ.23 కోట్లు ధాన్యం డబ్బులను జమచేశారు. అయితే ఈ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలుచేసిన ధాన్యాన్ని కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు తరలించేందుకు కాస్తా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ యాసంగి సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని పలు రైస్‌మిల్లులకు కేటాయించారు. ఈ రైస్‌మిల్లులోని ఎక్కువ మిల్లులు కా మారెడ్డి డివిజన్‌ ప్రాంతంలో ఉండడంతో బాన్సువాడ, జు క్కల్‌, ఎల్లారెడ్డి డివిజన్‌ ప్రాంతాల నుంచి కామారెడ్డికి త రలించేందుకు ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు ఎదురవుతున్నా యి. కలెక్టర్‌ ఆదేశాలతో సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Read more