ఎలుగుబంట్ల బెడద

ABN , First Publish Date - 2022-06-26T05:52:01+05:30 IST

గుడిబండ, కొంకల్లు, ఎస్‌రాయపురం, మందలపల్లి, పూజారిపల్లి, తలారం, దాసరపల్లి, కరేకెర, హిరేతుర్తి తదితర గ్రామాల్లో ఎలుగుబంట్ల బెడద అధికంగా ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నా రు.

ఎలుగుబంట్ల బెడద
గుడిబండ కొండపై సంచరిస్తున్న ఎలుగుబంటి

గుడిబండ, జూన 25 : గుడిబండ, కొంకల్లు, ఎస్‌రాయపురం, మందలపల్లి, పూజారిపల్లి, తలారం, దాసరపల్లి, కరేకెర, హిరేతుర్తి తదితర గ్రామాల్లో ఎలుగుబంట్ల బెడద అధికంగా ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నా రు. ఈ గ్రామాలు అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండడంతో ఆహారం కోసం ఆడవి జంతువులు గ్రామాల్లోకి వ స్తుండటంతో  ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిరేతుర్తి, గుడిబండ గ్రామాల్లో పట్టపగలే పంటపొలాలు, కొం డలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను అటవీ ప్రాంతంలోకి తర లించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.   

Updated Date - 2022-06-26T05:52:01+05:30 IST