కరోనాతో బతకడం కష్టమే.. హైదరాబాద్ వాసుల్లో భయం.. భయం..

ABN , First Publish Date - 2020-07-06T17:36:37+05:30 IST

కరోనాతో బతకడం కష్టమని గ్రేటర్‌వాసులు అభిప్రాయపడుతున్నారు. ఏం కొనాలన్నా.. తినాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా భయంగా

కరోనాతో బతకడం కష్టమే.. హైదరాబాద్ వాసుల్లో భయం.. భయం..

గ్రేటర్‌ వాసుల్లో భయం..భయం

రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు


హైదరాబాద్ సిటీ న్యూస్‌ నెట్‌వర్క్‌(ఆంధ్రజ్యోతి): కరోనాతో బతకడం కష్టమని గ్రేటర్‌వాసులు అభిప్రాయపడుతున్నారు. ఏం కొనాలన్నా.. తినాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా భయంగా ఉందని చెబుతున్నారు. ఆదివారం 1,277 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు.  


రామంతాపూర్‌ పరిధిలోని వెంకట్‌రెడ్డినగర్‌, శ్రీనివాసపురం, ఇందిరానగర్‌కు చెందిన ఏడుగురితోపాటు కాప్రా సర్కిల్‌ నాచారానికి చెందిన వ్యక్తి(34), బాబానగర్‌లో మహిళ(25), అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న మహిళ(28), మల్లాపూర్‌లో బాలిక(7), గోకుల్‌నగర్‌లో మహిళ(31), కుషాయిగూడ గణే్‌షనగర్‌లో ఓ వ్యక్తి(35), మల్కాజిగిరి మారుతీనగర్‌కు చెందిన వ్యక్తి(30)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 10 మందికి పాజిటివ్‌ వచ్చింది. సరోజినీదేవి ఆస్పత్రిలో ఆదివారం కరోనా పరీక్షలను నిలిపేశారు.  


మూసాపేట సర్కిల్‌ పరిధిలోని భరత్‌నగర్‌, మూసాపేట ప్రాంతాల్లో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చెస్ట్‌ ఆస్పత్రిలో 86 మందికి చికిత్స అందిస్తున్నారు. యూసు్‌ఫగూడ డివిజన్‌లో 8, బోరబండలో 3, ఎర్రగడ్డలో 5, రహ్మత్‌నగర్‌లో 11, వెంగళరావునగర్‌లో  7 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


బర్కత్‌పురలో ఒకే ఇంట్లో వృద్ధుడు(73), వృద్ధురాలు(71), మరో వ్యక్తి(33), బాలిక(4), తిలక్‌నగర్‌లో వ్యక్తి(43), ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 12 మందికి, అశోక్‌నగర్‌ ఎస్‌బీహెచ్‌కాలనీకి చెందిన నలుగురు కరోనా బారినపడ్డారు. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో 56 అనుమానిత కేసులు నమోదయ్యాయి. 


హయత్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలో 47 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తపేటలోని ఒకే ఇంట్లో ఇద్దరితోపాటు మరొకరు(48), మోహన్‌నగర్‌లో ఒకరు(55), మరో వృద్ధుడు(73), గడ్డిఅన్నారంలో ఇద్దరికి, ఎల్‌బీనగర్‌లో చెందిన ముగ్గురికి, పీ అండ్‌ టీ కాలనీలో నలుగురికి, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఇద్దరికి, కర్మన్‌ఘాట్‌లో ముగ్గురికి, హయత్‌నగర్‌లో ఒకరు(45), చంపాపేటకు చెందిన ఇద్దరు యువకులకు, హస్తినాపురం ఇంద్రప్రస్తకాలనీలో ఒకరు(41), నాగోల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌కాలనీకి చెందిన వ్యక్తి(38), సాయినగర్‌లో ఒకరు(45), జైపురికాలనీలో ఇద్దరికి, చైతన్యపురిలో ఒకరు(56), సిరినగర్‌కాలనీకి చెందిన వైద్యుడు(33), ఓంకార్‌నగర్‌లో వృద్ధుడు(73), సరూర్‌నగర్‌లో ఇద్దరికి, ఎన్జీవో్‌సకాలనీలో ఒకరికి(32), సారునాథ్‌కాలనీలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది.


విజయపురికాలనీకి చెందిన వ్యక్తి(33), ఏడాది బాలుడు, మన్సూరాబాద్‌ సౌత్‌ఎండ్‌పార్క్‌లో ఒకరికి (38), అల్కాపురిలో ఒకరు(32), హయత్‌నగర్‌ విష్ణునగర్‌కు చెందిన మహిళ(36), హరిపురికాలనీ ఓ మహిళ (50), బీఎన్‌రెడ్డినగర్‌లో ఇద్దరికి, న్యూమారుతీనగర్‌లో ఓ వ్యక్తి(37), సూర్యానగర్‌కాలనీకి చెందిన ఉద్యోగి(33), హనుమాన్‌నగర్‌కాలనీలోని ఒకే ఇంట్లో ఇద్దరికి, రెడ్డిబస్తీలో ఓ వ్యక్తి(49)కి పాజిటివ్‌గా తేలింది.


తుర్కయంజాల్‌ మునిసిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్‌ గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఇంట్లో ముగ్గురికి, మునగనూర్‌ గ్రామంలో గృహిణి(58), పెద్దఅంబర్‌పేట్‌ మునిసిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కోహెడ రోడ్డులో ఉంటున్న మహిళ(24)కు పాజిటివ్‌ వచ్చింది. ఆజంపుర యూపీహెచ్‌సీ పరిధిలో ఏడుగురికి, జాంబాగ్‌ పార్క్‌ యూపీహెచ్‌సీ పరిధిలో ఒకరికి, డబీర్‌పుర యూపీహెచ్‌సీ పరిధిలో ఇద్దరికి, మలక్‌పేట యూపీహెచ్‌సీ పరిధిలో నలుగురికి, గడ్డిఅన్నారం యూపీహెచ్‌సీ పరిధిలో ఐదుగురికి, శాలివాహనననగర్‌ యూపీహెచ్‌సీ పరిధిలో ఆరుగురికి, మాదన్నపేట యూపీహెచ్‌సీ పరిధిలో 9 మందికి కరోనా సోకింది. 


ఐదుగురి మృతి

కరోనా వైర్‌సతో రామంతాపూర్‌లో ఓ విద్యాసంస్థ నిర్వాహకుడితోపాటు వృద్ధుడు, బర్కత్‌పుర పరిధి సుందర్‌నగర్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి, మల్కాజిగిరి మారుతీనగర్‌లో వృద్ధురాలు(63), అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధి పిగ్లీపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి(65) మృతి చెందారు. 


నింబోలిఅడ్డ బాలికా సదన్‌లో కలకలం

కాచిగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధి నింబోలిఅడ్డ బాలికా సదన్‌లో కరోనా కలకలం సృష్టించింది. సదన్‌లో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. మరో పది మంది నమూనాలు సేకరించారు. ఫలితాలు రావాల్సి ఉంది. సదన్‌లోని 30 మంది బాలికలకు కరోనా పరీక్షలు చేయాలని బాలల హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు. 


అవగాహన ర్యాలీ 

భోలక్‌పూర్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించేందుకు వివిధ పార్టీల నేతలు బడీ మసీదు నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ... వ్యాపారులు తప్పనిసరిగా శానిటైజర్‌ వాడాలని, గ్లౌజ్‌లు, మాస్క్‌లు ధరించి విక్రయాలు కొనసాగించాలని, ప్రజలు గుంపుగా ఉండొద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, అసోసియేషన్‌ ప్రతినిధులు అబ్రార్‌, హుస్సేన్‌, మహ్మద్‌ అలీ, నూరుద్దీన్‌, ఆరిఫ్‌, రహీం, వహీద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-06T17:36:37+05:30 IST