ఎఫ్‌డీఐల జోరు... తొలి ఆరు నెలల్లో రూ. 2.22 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2020-11-30T00:47:01+05:30 IST

ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుఎఫ్‌డీఐ)లు 15 శాతం పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్దఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఎఫ్‌డీఐల జోరు... తొలి ఆరు నెలల్లో రూ. 2.22 లక్షల కోట్లు

న్యూఢిల్లీ : ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుఎఫ్‌డీఐ)లు  15 శాతం పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్దఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్ల (రూ. 2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఇది 26 బిలియన్ డాలర్లు. ఇందులో ఎక్కువగా పెట్టుబడులు మారిషస్(29 శాతం), సింగపూర్(21 శాతం) నుండి వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ 7 శాతం వరకు ఉన్నాయి. ఎఫ్‌డీఐలు భారత్‌కు పెరగడంతో మారిషస్ నాలుగో స్థానానికి చేరింది. 


Updated Date - 2020-11-30T00:47:01+05:30 IST