ఎఫ్‌డీఐల ఇన్‌ఫ్లో... ఆల్-టైం గరిష్టం

ABN , First Publish Date - 2022-05-21T00:53:54+05:30 IST

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఆటోమొబైల్, సేవల రంగాలు ఎఫ్‌డీఐ ప్రవాహాలనాకర్షించాయి.

ఎఫ్‌డీఐల ఇన్‌ఫ్లో... ఆల్-టైం గరిష్టం

న్యూఢిల్లీ : సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఆటోమొబైల్, సేవల రంగాలు ఎఫ్‌డీఐ ప్రవాహాలనాకర్షించాయి. ఇండియాకు కిందటి ఆర్ధికసంవత్సరం(2021-22)  లో వచ్చిన 83.57 బిలియన్ డాలర్ల వార్షిక ఎఫ్‌డీఐ ప్రవాహమే ఇప్పటివరకు అత్యధికం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. కాగా... 2020-21 లో ఇన్‌ఫ్లో 81.97 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ‘తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రాధాన్యత కలిగిన దేశంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.


‘ఇండియా 2021-22 ఆర్థిక సంవత్సరంలో USD 83.57 బిలియన్ల వార్షిక ఎఫ్‌డీఐ ప్రవాహాన్ని నమోదు చేసింది’ అని పేర్కొంది. టాప్ ఇన్వెస్టర్ దేశాల విషయంలో సింగపూర్ 27 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా(18 శాతం), మారిషస్(16 శాతం) ఉన్నాయి. ఇక రంగాల విషయానికొస్తే... కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాలు గరిష్ట ప్రవాహాలను ఆకర్షించాయి. ఆ తర్వాత సర్వీసుల రంగం, ఆటోమొబైల్ పరిశ్రమ ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. సులభంగా వ్యాపారం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఎఫ్‌డీఐ విధానాన్ని సరళీకృతం చేయడానికి, బొగ్గు గనులు, డిజిటల్ మీడియా, సింగిల్-బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్, పౌరవిమానయానం, రక్షణ, బీమా, టెలికాం తదితర రంగాల్లో ఇటీవల సంస్కరణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-05-21T00:53:54+05:30 IST