ఐఎఫ్ఎస్ సాధించిన తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ విద్యార్ధి

ABN , First Publish Date - 2022-06-29T23:10:07+05:30 IST

తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ (FCRI)విద్యార్థి కె.రాజు మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) సాధించారు.

ఐఎఫ్ఎస్ సాధించిన తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ విద్యార్ధి

హైదరాబాద్: తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ (FCRI)విద్యార్థి కె.రాజు మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) సాధించారు.మొదటి ప్రయత్నంలోనే రాజు జాతీయ స్థాయిలో 86వ ర్యాంకు సాధించారు. 2017లో ములుగులో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ (FCRI) మొదటి బ్యాచ్ విద్యార్ధి అతను.జనగామ జిల్లా సూరారం గ్రామానికి చెందిన రాజు మొదటి సారి ప్రయత్నంలోనే తను అనుకున్నది సాధించారు.జాతీయ స్థాయి అధికారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీయార్ ఫారెస్ట్ కాలేజీ నెలకొల్పారు. ఈ కాలేజీలో చదువుతున్నపలువురు విద్యార్ధులు ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కాలేజీల్లో ర్యాంకులు పొందారు. 

Updated Date - 2022-06-29T23:10:07+05:30 IST