ఫేస్‌బుక్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్.. భారతీయులకు ప్రత్యేకం!

ABN , First Publish Date - 2020-05-23T00:21:36+05:30 IST

ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌లో ఓ సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఫేస్‌బుక్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్.. భారతీయులకు ప్రత్యేకం!

న్యూఢిల్లీ: ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌లో ఓ సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని కోట్లమంది వినియోగదారులున్న ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత వివరాలను దాచుకునేందుకు ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, ఫేస్‌బుక్‌లో మన ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ముఖ్యంగా భారతదేశంలోని మహిళల కోసమే అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారతీయ మహిళలు తమ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌పై మరింత కంట్రోల్ కోరుకుంటున్నారని, అలాంటి వారికోసమే ఈ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టామని వారు చెప్పారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ ఆంఖీ దాస్ మాట్లాడుతూ.. ‘ప్రజలు ఎటువంటి భయం లేకుండా తమ భావాలను పంచుకునే విధంగా మా ప్లాట్‌ఫాంను సిద్ధంచేశాం. ఈ క్రమంలో వినియోగదారుల భద్రతే మా ప్రధాన లక్ష్యం. వారి ఇబ్బందులు, ముఖ్యంగా భారతీయ మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాం. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా వీరి వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలియవు. తద్వారా మహిళల ప్రొఫైల్స్‌కు భద్రత పెరుగుతుంది’ అని చెప్పారు.

Updated Date - 2020-05-23T00:21:36+05:30 IST