ఫాజిల్‌ కొత్త స్మార్ట్‌వాచీ

ABN , First Publish Date - 2022-07-02T08:47:50+05:30 IST

ఫాజిల్‌ కొత్త వాచీని విడుదల చేసింది.

ఫాజిల్‌ కొత్త స్మార్ట్‌వాచీ

ఫాజిల్‌ కొత్త వాచీని విడుదల చేసింది. జన్‌ 6 హైబ్రిడ్‌ స్మార్ట్‌ వాచీ ఇది. రెండు వారాల బ్యాటరీ లైఫ్‌కు తోడు అలెక్సాకు యాక్సెస్‌, సరికొత్త ఎస్‌పీఓ2 సెన్సర్‌, బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఇ వంటి వన్నీ ఉన్నాయి. లెదర్‌, సిలికాన్‌ స్ట్రాప్‌ స్టయిల్‌ వాచీలు ఒక్కోటి రూ.17,633 కాగా బ్రాస్‌లెట్‌ స్టయిల్‌కి చెందిన వాచీ రేటు రూ19,173. దీని కేసు 45 ఎం.ఎం. ఇందులోని అలెక్సాతో యూజర్లు ఇంటరాక్ట్‌ కావచ్చు. న్యూ మైక్రోఫోన్‌తో వాయిస్‌ ఇన్‌పుట్‌తో ఈ పని చేయవచ్చు. అలెక్సా  సమాధానాన్ని చదువుకునే సౌలభ్యం కూడా ఉంది. ఎస్‌పిఒ2తో స్లీప్‌, స్టెప్స్‌, వర్కౌట్స్‌ తదితరాలన్నింటినీ ట్రాక్‌ చేసుకోవచ్చు. ఫాజిల్‌ స్మార్ట్‌ వాచీల కంపానియన్‌ యాప్‌ను కూడా రీడిజైన్‌ చేశారు. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ రెంటికీ పాజిల్‌ స్మార్ట్‌ వాచెస్‌ యాప్‌ అందుబాటులో ఉంటుంది. 

Updated Date - 2022-07-02T08:47:50+05:30 IST