May 31 2021 @ 18:51PM

‘దంగల్‌’ నటికి ఇన్ని కష్టాలా?

కోవిడ్‌ 19 అన్ని రంగాల వారికీ కష్టాలు తెచ్పి పెట్టింది. లాక్‌డౌన్‌ కారణంగా ఎంతోమందికి ఉపాధి లేకుండా చేసింది. తాజాగా తన పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని ‘దంగల్‌’ చిత్రంలో గీతా పోగట్‌ పాత్ర పోషించిన ఫాతిమా సనాఖన్‌ చెప్పారు. ‘‘కోవిడ్‌ వల్ల ఎంతోమంది నిరుద్యోగులు అయ్యారు. ఇప్పుడు నేను అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నా. కరోనా కష్ట కాలం తగ్గితే తప్ప ఎవరికీ పనులు దొరకవు. షూటింగ్‌లు మొదలైతేనే నాకూ పని దొరుకుతుంది. ప్రస్తుతానికి నేను నిరుద్యోగిని’’ అని ఫాతిమా సనాఖాన్‌ చెప్పారు. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె ‘దంగల్‌’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ తదితర చిత్రాల్లో నటించారు. 




Bollywoodమరిన్ని...