కోడలు స్నానం చేస్తుండగా వీడియో తీసిన మామ.. అది చూపించి అత్యాచారం.. విషయం భర్తకు చెబితే..

ABN , First Publish Date - 2022-04-16T18:30:25+05:30 IST

మామ అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడంటారు. అయితే ఓ మామ మానవ మృగంలా ప్రవర్తించాడు.

కోడలు స్నానం చేస్తుండగా వీడియో తీసిన మామ.. అది చూపించి అత్యాచారం.. విషయం భర్తకు చెబితే..

మామ అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడంటారు. అయితే ఓ మామ మానవ మృగంలా ప్రవర్తించాడు. కొడుకు భార్యపై అకృత్యానికి తెగబడ్డాడు. ఆమె స్నానం చేస్తుండగా మొబైల్‌తో వీడియో తీశాడు. దానిని చూపించి ఆమెను బెదిరించి లైంగికంగా వేధించాడు. ఆ మహిళ తన భర్తకు విషయం చెప్పింది. తండ్రిని మందలించాల్సిన ఆ ప్రబుద్ధుడు భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. 


రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళకు ఏప్రిల్ 8, 2012న వివాహం జరిగింది. ఐదేళ్ల తర్వాత ఆ మహిళ భర్త ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. ఒంటరిగా ఉంటున్న ఆ మహిళపై మామ కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా మొబైల్‌తో వీడియో తీశాడు. ఒకరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగ్న వీడియోలు, ఫొటోలు చూపించి ఆమెను బెదిరించాడు. ఆ ఘటన గురించి ఆ మహిళ తన అత్తకు చెప్పగా ఆమె సర్దిచెప్పి ఊరుకుంది. 


ఏడాది తర్వాత వచ్చిన భర్తకు ఆ మహిళ తనపై జరిగిన అకృత్యం గురించి చెప్పింది. తండ్రిని మందలించాల్సిన ఆ వ్యక్తి భార్యనే తప్పుబట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ ఇచ్చి నెల రోజులు దాటినా పోలీసులు వారిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. దీంతో ఆ మహిళ జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. 

Updated Date - 2022-04-16T18:30:25+05:30 IST