నాన్నకు ప్రేమతో...

ABN , First Publish Date - 2020-06-21T05:30:00+05:30 IST

నాన్నంటే బాధ్యత.. నాన్నంటే భరోసా... చిన్నప్పటి నుంచి మనకు నాన్న అందించే బహుమతులు చాలానే ఉంటాయి. పుట్టినరోజుతో మొదలు క్లాసులో మొదటి ర్యాంకు వచ్చినా, మంచి కాలేజీలో సీటు దొరికినా, పేరొందిన కంపెనీలో ఉద్యోగం వచ్చినా...

నాన్నకు ప్రేమతో...

నాన్నంటే బాధ్యత.. నాన్నంటే భరోసా... చిన్నప్పటి నుంచి మనకు నాన్న అందించే బహుమతులు చాలానే ఉంటాయి. పుట్టినరోజుతో మొదలు క్లాసులో మొదటి ర్యాంకు వచ్చినా, మంచి కాలేజీలో సీటు దొరికినా, పేరొందిన కంపెనీలో ఉద్యోగం వచ్చినా నాన్న ఎంత పొంగిపోతాడో. మనకోసం ఎన్నో బహుమతులు ఇచ్చిన నాన్నకు ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా ఆయనకు ఇష్టమైన కానుక ఇచ్చి ఆశ్చర్యపరుద్దాం. నాన్నకు ఏమేం ఇవ్వొచ్చంటే...


ఫొటో ఆల్బమ్‌: నాన్న చిన్నప్పుడు, కాలేజీ రోజుల్లో, పెళ్లి నాటి ఫొటో, మిమ్మల్ని వేలు పట్టి నడిపిస్తున్న నాన్న... ఇలా ప్రత్యేక సందర్భాలకు గుర్తుగా మిగిలిన ఫొటోలతో కూడిన ఆల్బమ్‌ బహుమతిగానే కాదు జ్ఞాపకంగానూ ఉంటుంది. మీ ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్‌ తిరగేస్తూ సరదాగా గడపండి.


కలిసి సినిమా చూడండి: నాన్నతో కలిసి సరదాగా సినిమాకు వెళ్లలేకపోతున్నామని బాధ పడకండి. ఇంట్లోనే ఆన్‌లైన్‌లో నాన్నతో కొత్త కొత్త సినిమాలు చూసి ఆస్వాదించండి. 


షేవింగ్‌ కిట్‌, వాచీ: ఈసారి కొత్త షేవింగ్‌ కిట్‌ కానుకగా ఇచ్చి నాన్నను ఆశ్చర్యపరచండి. అలానే చేతి గడియారం కొనిచ్చినా కూడా గుర్తుండిపోతుంది. 


నచ్చిన వంటకం: నాన్నకు ఏ చిరుతిండి ఇష్టమో, ఏవి ఇష్టంగా తినేవారో మీ నానమ్మను అడిగి తెలుసుకోండి. ఈ రోజున ఆ వంటకాలను నాన్న కోసం మీరే స్వయంగా వండి అందించండి. కుటుంబమంతా కలిసి ఒకేసారి భోజనం చేయండి. కబుర్లు చెప్పుకుంటూ, నాన్నతో ఎక్కువ సమయం గడుపుతూ ఆ రోజును నాన్నకు బహుమతిగా ఇవ్వండి. 


లేఖ రాయండి: వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో ‘ఫాదర్స్‌ డే’ విషెస్‌ చెప్పడం అందరూ చేసేదే. అలాకాకుండా మీకు నాన్న మీదున్న ప్రేమను, నాన్నతో మీ జ్ఞాపకాలను ఒక లేఖలో రాసి విష్‌ చేయండి. ఆ లేఖ చదివి మీ నాన్న ఎంతో సంతోషిస్తారు.


ఆత్మీయ సెల్ఫీ: స్నేహితులతో చాలాసార్లు సెల్ఫీ దిగుంటారు. కుటుంబమంతా సెల్ఫీ దిగి చాన్నాళ్లయి ఉంటుంది కదా! ఈసారి ‘ఫాదర్స్‌ డే’ రోజున నాన్నతో సెల్ఫీ దిగండి. ఆ ఫొటోను మీ ఫ్యామిలీ ఆల్బమ్‌లో జోడించండి.


Updated Date - 2020-06-21T05:30:00+05:30 IST