17ఏళ్ల కూతురిని చికిత్సకోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ ఆ అమ్మాయి అసలు విషయం చెప్పడంతో.. షాకైన తండ్రి..!

ABN , First Publish Date - 2021-11-05T16:52:04+05:30 IST

ఇంటినుంచి ప్రియుడితో..

17ఏళ్ల కూతురిని చికిత్సకోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ ఆ అమ్మాయి అసలు విషయం చెప్పడంతో.. షాకైన తండ్రి..!

ఇంటర్‌నెట్‌డెస్క్: ఇంటినుంచి ప్రియుడితో పారిపోయిన అమ్మాయి వేరే ఊర్లో దొరికింది. చికిత్సకోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆమె అసలు విషయం చెప్పింది. అది విన్న తండ్రి, పోలీసులు షాకయ్యారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని బండికుయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..


బండికుయ్ పట్టణం నై కోఠి పిచుపడ కలాన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూతురు(17ఏళ్లు) సెప్టెంబర్ 7న అర్థరాత్రి సమయంలో ప్రియుడితో ఇంటినుంచి పారిపోయింది. మరుసటిరోజు తెల్లవారుజామున కూతురు కనిపించకపోవడంతో.. తండ్రి ఊరంతా వెతకడం ప్రారంభించాడు. కానీ అతడికి ఆమె ఎక్కడా కనిపించలేదు. తన కూతురు ప్రేమించిన జీతూ అలియాస్ జితేందర్ శర్మ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి.. ‘నా కూతురు ఎక్కడా..?’అంటూ గొడవపెట్టుకున్నాడు. కానీ జితేందర్ తల్లిదండ్రులు తమకేమి తెలియదని, మీ కూతురి వల్లే తమ కుమారుడు కూడా కనిపించడం లేదని వారు కూడా తగదాకు దిగారు. కూతురు కోసం పక్క ఊర్లళ్లో తండ్రి గాలించాడు. ఇక లాభం లేదనుకుని చివరికి సెప్టెంబర్ 12న బండికుయ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ‘ సెప్టెంబర్ 7న నా కూతురు తన గదిలో పడుకుంటానని వెళ్లింది. తెల్లవారుజామున చూస్తే.. ఆమె కనిపించలేదు. మా గ్రామంలో ఉండే జితేందర్ అనే వ్యక్తే నా కూతురును తీసుకెళ్లాడు. అంతేకాకుండా ప్లాట్ అమ్మితే వచ్చిన రూ.2లక్షలు కూడా కనిపించడం లేదు’అని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికోసం గాలించారు. గురువారం ఢిల్లీలో వారిద్దరిని పట్టుకున్నారు. ఇంట్లోనుంచి తీసుకెళ్లిన రూ.2లక్షలు ఎక్కడా అని అడిగితే.. కేవలం 15వేల రూపాయలు మాత్రమే మిగిలాయని చూపించారు.  



బండికుయ్ పోలీస్‌స్టేషన్‌లో తమ కూతురు ఉందని తెలసి తండ్రి వచ్చాడు. ఆమె నీరసంగా ఉండడంతో బండికుయ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాకా వారికి ఓ విషయం తెలిసింది. కూతురితో జితేందర్ శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడని తెలిసి తండ్రి షాకయ్యాడు. ‘అతడు నాతో శారీరకంగా చాలాసార్లు కలిశాడు. ప్రస్తుతం నేను అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’అని ఆమె చెప్పింది. ఆమెకు ఇంకా 18ఏళ్లు రాలేదు కాబట్టి ఇంకో సంవత్సరం ఆగాలని పోలీసులు చెప్పారు. జితేందర్‌ను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.



Updated Date - 2021-11-05T16:52:04+05:30 IST