నిద్రపోతున్న చిన్న కూతురిపై అత్యాచారం.. షాకింగ్ విషయం చెప్పిన పెద్ద కూతురు.. కోర్టు అతనికి విధించిన శిక్ష ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-17T15:51:31+05:30 IST

కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక వ్యక్తి తన కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.

నిద్రపోతున్న చిన్న కూతురిపై అత్యాచారం.. షాకింగ్ విషయం చెప్పిన పెద్ద కూతురు.. కోర్టు అతనికి విధించిన శిక్ష ఏంటంటే..

కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక వ్యక్తి తన కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న చిన్న కూతురి నోరు మూసి తన కామ వాంఛ తీర్చుకున్నాడు. తర్వాతి రోజు ఉదయం ఆ యువతి తన తల్లికి విషయం చెప్పింది. దీంతో పెద్ద కూతురు మరో షాకింగ్ విషయం బయటపెట్టింది. ఏడాది కిత్రం తనపై కూడా తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి నెల రోజుల క్రితం ఇంట్లో నిద్రపోతున్న తన చిన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో ఆమె దగ్గరకు వెళ్లి నోరు మూసి అత్యాచారం చేశాడు. తర్వాతి రోజు ఉదయం ఆ యువతి తన తల్లికి తండ్రి చేసిన ఘాతుకం గురించి చెప్పింది. అక్కడే ఉన్న పెద్ద కూతురు కూడా నోరు విప్పింది. ఏడాది క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనపై కూడా తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది.


ఎవరికైనా చెబితే చెంపేస్తానని బెదిరించాడని, అందుకే ఎవరికీ చెప్పలేదని ఆమె కన్నీళ్లతో తల్లికి వివరించింది. దీంతో తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష, రూ.9 వేల జరిమానా విధించింది.  

Updated Date - 2022-03-17T15:51:31+05:30 IST