Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండు సంవత్సరాలుగా కూతురు దూరం.. ఇంటల్లుడితో విసిగిపోయిన మామ.. ఏం చేశాడంటే..

ఇంటల్లుడిగా అత్తగారింట్లో మకాం వేసి.. తన భార్యను ఉద్యోగం కోసం కేరళకు పంపించాడు. రెండేళ్లుగా ఆమె తిరిగి రాలేదు. అత్త, మామలు ఇదేంటని అడిగితే గొడవ పెట్టుకుంటాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన అత్త,మామలు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. 


ఝార్ఖండ్ రాష్ట్రంలోని సాహెబ్‌గంజ్ జిల్లాలో రణ్‌చరా గ్రామంలో నివసించే హరదేవ్(56) అనే వ్యక్తి మూడేళ్ల క్రితం తన కూతురు నానామయ్‌ని పక్క గ్రామానికి చెందిన సఫల్ హంసదా అనే వ్యక్తికిచ్చి వివాహం  చేశాడు. వివాహం జరిగిన కొన్ని రోజుల తరువాత సఫల్ తన అత్తారింటికి మకాం మార్చాడు. అతను ఏ పని చేయకుండా బలాదూర్ తిరుగుతుండడంతో చూసిన భార్య ఉద్యోగం చేయాలనుకుంది. దీంతో ఆమెకు కేరళలో ఉద్యోగం దొరికింది.


అలా రెండేళ్ల క్రితం నానామమ్ తల్లిదండ్రులను వదిలి కేరళ వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె ఇంటికి తిరిగిరాలేదు. కూతురిని చూడడానికి ఆ తల్లిదండ్రులు తపించిపోయారు. ఆమెను తిరిగి రమ్మని ఎంత చెప్పినా.. భర్త అందుకు అంగీకరించడం లేదని ఆమె చెప్పింది. ఒకరోజు హరదేవ్ తన అల్లుడు సఫల్‌ని పిలిచి ఏదైనా ఉద్యోగం చూసుకొని.. అమ్మాయిని కేరళ నుంచి పిలిపించమని  చెప్పాడు. దీంతో సఫల్ తన మామతో గొడవకు దిగాడు. తన భార్య, తన ఇష్టమని కోపంగా మాట్లాడాడు. అల్లుడు అలా మాట్లాడడంతో హరదేవ్‌ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. 


సఫల్‌ వల్ల తన కూతురి జీవితం నాశనమైందని బాధపడ్డ హరదేవ్ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు సఫల్ ఇంటికి రాగానే.. వెనుక నుంచి ఒక్కసారిగా అతని తలపై ఒక గొడ్డలితో హరదేవ్ దాడి చేశాడు. దీంతొ సఫల్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపంచారు. హరదేవ్‌ని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement