ఛీ..ఛీ.. వీడసలు తండ్రేనా.. 8 ఏళ్ల కొడుకును తలకిందులుగా వేలాడదీసి మరీ చిత్రహింసలు.. ఆ తల్లి సీక్రెట్‌గా వీడియోను తీసి..
ABN , First Publish Date - 2021-11-24T21:25:32+05:30 IST
ఒక తండ్రి తన ఎనిమిదేళ్ల కొడుకుతో అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు.
ఒక తండ్రి తన ఎనిమిదేళ్ల కొడుకుతో అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తలకిందులుగా వేలాడదీసి చితక్కొట్టాడు. `కిందకు దింపు.. కిందకు దింపు` అంటూ బాలుడు ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. బూతులు తిడుతూ చంపేస్తానని బెదిరించాడు. హోమ్‌వర్క్ చేయకుండా ఆడుకోవడానికి వెళ్లాడమే ఆ బాలుడు చేసిన తప్పు. ఆ మాత్రం దానికే ఆ తండ్రి కర్కశంగా ప్రవర్తించాడు. రాజస్థాన్‌లోని ఛిత్తోర్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది.
ఛిత్తోర్‌గఢ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన వెంటనే హోమ్‌వర్క్ రాసుకోకుండా ఆడుకోవడానికి వెళ్లాడు. డ్యూటీ నుంచి వచ్చాక తండ్రి ఆ విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయాడు. కొడుకును పట్టుకుని తలకిందులుగా వేలాడదీశాడు. కర్రతో కొట్టాడు. బాలుడు ఎంతగా ప్రాథేయపడుతున్నా కనికరించలేదు. బాలుడి తల్లి అడ్డుపడినా అతను ఆగలేదు. భర్త తన కొడుకును చిత్రహింసలు పెడుతున్న ఘటనను తల్లి వీడియో తీసింది. ఆ వీడియోను తన సోదరుడికి అందించింది. అతను ఆ వీడియోను పోలీసులకు చూపించి తన బావపై ఫిర్యాదు చేశాడు. చైల్డ్ లైఫ్ నెంబర్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు.