Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీ పెట్టమన్న తండ్రి.. పనిలో పడి ఆ విషయమే మర్చిపోయిన 13ఏళ్ల కూతురు.. దీంతో అతడు చేసిన పని నెట్టింట వైరల్..

ఇంటర్నెట్ డెస్క్: ఆ చిన్నారికి ప్రస్తుతం 13ఏళ్లు. మూడేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన ఆమె.. ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ అక్కకు సాయంగా ఉంటుంది. ఈ క్రమంలోనే రాత్రి తినడానికి రోటీలను సిద్ధం చేస్తున్న సమయంలో.. అప్పుడే ఇంటికొచ్చిన తండ్రి చాయ్ కావాలని కూతురిని అడిగాడు. దీంతో ‘సరే’ అంటూ తండ్రికి బదులిచ్చిన ఆమె.. ఆ తర్వాత పనిలో పడి ఆ విషయమే మర్చిపోయింది. ఈ క్రమంలో టీ పెట్టనందుకు ఆగ్రహానికి లోనైన తండ్రి.. దారుణంగా ప్రవర్తించాడు. అతడు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతానికి చెందిన ఓ మేకల కాపరికి కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత.. అనారోగ్యానికి గురై ఆమె మృతి చెందింది. ఈ క్రమంలో మూడేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన చిన్నారి.. పెరిగి పెద్దయింది. ఇంటి పనుల్లో అక్కకు ఆసరాగా నిలిచింది. కాగా.. గురువారం రాత్రి భోజనం కోసం రోటీలు చేస్తున్న సమయంలో ఇంటికొచ్చిన తండ్రి.. చాయ్ కావాలని అడగడంతో ‘సరే’ అంటూ ఆమె బదులిచ్చింది. తర్వాత పనిలో పడి.. ఆ చిన్నారి ఆ విషయమే మరిచిపోయింది. ఈ క్రమంలో కూతురు చాయ్ పెట్టలేదని తెలుసుకున్న ఆ తండ్రి.. ఆగ్రహానికి లోనయ్యాడు. కోపంతో ఊగిపోతూ.. ఆమెపై దారుణంగా ప్రవర్తించాడు. కాళ్లను తాడుతో కట్టేసి.. కర్రతో చితకబాదాడు. ఆ చిన్నారి అరుపులు విన్న.. స్థానికులు తండ్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అతడు తగ్గలేదు. దీంతో కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో.. పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement