Advertisement
Advertisement
Abn logo
Advertisement

బలవంతంగా ఆమెకు జుట్టు కత్తిరించారు.. నదిలో మునకలు వేయించి.. తడిసిన దుస్తులను వదిలివేయించారు.. కన్నీరు పెట్టించే యథార్థ కథనం

ఆమె తనకు నచ్చిన యువకుడిని వివాహం చేసుకుంది.. అయితే తమ పరువు మంటకలిపిందంటూ ఆ యువతి కుటుంబీకులు ఆమెను అష్టకష్టాలపాలు చేశారు. దీంతో ఆమె తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో దళిత యువకుడిని వివాహం చేసుకున్న ఒక నర్సింగ్ విద్యార్థిని చేత నర్మదా నదిలో స్నానం చేయించి, శుద్ధి చేసిన ఉదంతం స్థానికంగా సంచలనం కలిగించింది. పరువు హత్య భయంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరింది. వివరాల్లోకి వెళితే ఈ ఉదంతం జిల్లాలోని చోపాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువతి పోలీసులను ఆశ్రయించి.. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకుంది. 

ఈ ఉదంతం గురించి మహిళా సెల్ డీఎస్పీ పల్లవి గౌర్ మాట్లాడుతూ బాధితురాలు యాదవ కులానికి చెందినదని అన్నారు. ఆ 24 ఏళ్ల యువతి.. బైతూల్‌లోని టికారీ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మార్చి 11న ఆర్య సమాజ్‌లో వీరి వివాహం జరిగింది. అయితే ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో ఆమెను అత్తవారింటి నుంచి పుట్టింటికి రప్పించి, చదువుకునేందుకు తిరిగి రాజ్‌గఢ్‌లోని హాస్టల్‌కు పంపించారు. అయితే ఆమె అక్టోబరు 28న హాస్టల్ నుంచి పారిపోయి బైతూల్‌లో ఉంటున్న భర్త దగ్గరకు చేరుకుంది. కాగా ఆ యవతి తండ్రి ఆగస్టు 18న పెద్దలందరి సమక్షంలో బలవంతంగా ఆమె చేత నర్మదా నదిలో స్నానం చేయించి శుద్ధీకరణ చేయించాడు. ఆమె జుట్టు కత్తిరించి, ఆ సమయంలో ఆమె ధరించిన దుస్తులను అక్కడే పారవేయించాడు. ఈ ప్రక్రియ ద్వారా తన కుమార్తెకు తిరిగి తమకు నచ్చిన మరో వ్యక్తితో వివాహం చేయించవచ్చని తండ్రి భావించాడు. పోలీసులను ఆశ్రయించిన ఆ యువతి తన తండ్రి తమను పరువు హత్యకు బలిచేస్తాడనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. పెళ్లయిన తరువాత నుంచి పుట్టింటివారు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. తాను అదృశ్యమయ్యానంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని ఆమె తెలిపింది. దీంతో ముగ్గురు పోలీసులు తనను బలవంతంగా అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చారని పేర్కొంది. మైనారిటీ తీరిన తాను తన ఇష్టప్రకారం వివాహం చేసుకున్నానని, తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement