ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపై అత్యాచారం చేసి చంపి అడవిలో పారేసిన తండ్రి.. అసలు నిజం ఆ భర్తకు తెలిసి..

ABN , First Publish Date - 2021-11-20T21:35:05+05:30 IST

వారిద్దరూ పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు.. పెళ్లి తర్వాత వేరే ఊరు వెళ్లిపోయి కాపురం పెట్టారు.. ఓ మగ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు.. ఎనిమిది నెలల ఆ చిన్నారి ఇటీవల మరణించాడు.. దు:ఖాన్ని తట్టుకోలేకపోయిన యువతి తన తండ్రికి

ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపై అత్యాచారం చేసి చంపి అడవిలో పారేసిన తండ్రి.. అసలు నిజం ఆ భర్తకు తెలిసి..

ఇంటర్నెట్ డెస్క్: వారిద్దరూ పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు.. పెళ్లి తర్వాత వేరే ఊరు వెళ్లిపోయి కాపురం పెట్టారు.. ఓ మగ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు.. ఎనిమిది నెలల ఆ చిన్నారి ఇటీవల మరణించాడు.. దు:ఖాన్ని తట్టుకోలేకపోయిన యువతి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.. అయ్యో పాపం అని జాలి చూపాల్సిన ఆ త్రండి కూతురిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు.. కొడుకు చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను చంపేశాడు.. భార్య చనిపోవడంతో తాజాగా ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. 


భోపాల్‌కు సమీపంలోని బుకేష్‌గంజ్ అనే ప్రాంతానికి చెందిన కమలేష్ అనే వ్యక్తి కూతురు గతేడాది ప్రేమ వివాహం చేసుకుంది. భర్తతో కలిసి రాయ్‌పూర్‌లో నివసిస్తోంది. ఎనిమిది నెలల క్రితం జన్మించిన మగ బిడ్డ అనారోగ్యం కారణంతో దీపావళి రోజు రాత్రి చనిపోయాడు. ఆ దు:ఖాన్ని ఆమె తన తండ్రితో పంచుకుంది. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి మాట్లాడింది. విషయం విని చింతించాల్సిన ఆ తండ్రి పాత విషయాన్ని గుర్తు పెట్టుకుని కూతురిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఎనిమిది నెలల బాబు మృతదేహాన్ని అడవిలో పాతి పెడదామని చెప్పి కూతురిని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడే ఆమెను గొంతు నులిమి చంపేశాడు.



ఆ విషయాన్ని భార్యకు, పెద్ద కూతురికి ఫోన్ ద్వారా చెప్పి పరారయ్యాడు. మృతదేహం గురించి సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు కమలేష్‌ను అరెస్ట్ చేశారు. తన కూతురు చేసుకున్న ప్రేమ వివాహం వల్ల తమ పరువు పోయిందని, ఏడాది పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయామని, అందుకే ఆమెను చంపేశానని కమలేష్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. తాజాగా ఆమె భర్త కూడా మరణించాడు. ఇంట్లోనే ఉరి వేసుకుని మరణించాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.




Updated Date - 2021-11-20T21:35:05+05:30 IST